దాని తర్వత సినిమాలు ఆపేస్తాను

First Published 11, Apr 2018, 12:03 PM IST
Samantha Planning about Kids
Highlights
నాకు పిల్లలు పుట్టిన తర్వత సినిమాలు ఆపేస్తాను

రంగస్థలం సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న సమంత. సినిమా ప్రమోషన్లో భాగంగా తన మనసులోని మాటలను భయటపెట్టిన సమంత. పిల్లలు ఎప్పుడు అని అడగగా.. సమంత ఇలా సమాధానం ఇచ్చింది.  పిల్లల విషయంలో కూడా ముందే టైం ఇప్పటికే టైం ఫిక్స్ చేసేసుకుందట. ఎప్పుడు పిల్లలను కనాలి.. తను ఎప్పుడు అమ్మ అవ్వాలి అనే విషయంలో ఫుల్లు క్లారిటీ ఉందని చెప్పింది సమంత.

తను ఓ చిన్నారికి జన్మనిచ్చిన తర్వాత మాత్రం.. ఆ బిడ్డకే అంకితం అయిపోవాలని ఫిక్స్ అయిందట సామ్. చిన్నతనంలో తానేమీ అంత గారాబంగా పెరగలేదని.. కానీ తన బిడ్డను మాత్రం అపురూపంగా చూసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పిన సమంత.. తాను అమ్మగా మారిన తర్వాత కొన్నేళ్ల పాటు ఆ బిడ్డను వదిలి ఎక్కడికీ వెళ్లే సమస్యే లేదని అంటోంది.

loader