సమంత ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుంది. అభిమానులు మరోసారి ఆమె ట్రెండ్‌ చేస్తున్నారు. అయితే ఈ సారి ట్రెండ్‌ అయ్యేది పాజిటివ్‌గా కాదు, నెగటివ్‌గా. `షేమ్‌ ఆన్‌ యు సమంత` అనే యాష్‌ ట్యాగ్‌తో కోలీవుడ్‌ ఫ్యాన్స్ సమంతని ట్రెండ్‌ చేస్తున్నారు. అందుకు కారణంగా ఆమె నటించిన `ది ఫ్యామిలీ మ్యాన్‌2` వెబ్‌ సిరీస్‌. ఈ సిరీస్‌ ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఇందులో సమంత ఎల్‌టీటీఈ కి చెందిన నాయకురాలిగా నటించడమే అందుకు కారణంగా. తాను ఇందులో `అందరిని చంపేస్తా` అని చెప్పే డైలాగ్‌ కూడా అందుకు కారణం. 

ఈ వెబ్‌ సిరీస్‌లో ఎల్‌టీటీఈ సంస్థని టెర్రరిస్ట్ సంస్థగా చూపించడం, వారిని టెర్రరిస్ట్ గా చూపించడమే ఇందుకు కారణం. హక్కుల కోసం పోరాడిన సంస్థని తప్పుగా చూపిస్తున్నారని తమిళ ఆడియెన్స్ ప్రశ్నిస్తున్నారు. శ్రీలంకలో తమిళ హక్కుల కోసం ప్రభాకరణ్‌ పోరాడని అంటూ ఆయన చరిత్రని, ఆయన అరుదైన ఫోటోలను పంచుకుంటున్నారు తమిళ అభిమానులు. అయితే సమంత ఇలాంటి వెబ్‌ సిరీస్‌లో నటిస్తుందని అస్సలు ఊహించలేదని, ఇది తమకు షేమ్‌ అని అంటున్నారు. అందులో భాగంగానే `#ShameonYouSamantha` యాష్‌ ట్యాగ్‌ని ట్రెండ్‌ చేస్తున్నారు. 

మరోవైపు ఈ నెల 4న ఈ వెబ్‌ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మరోసారి తమ నిరసన తెలియజేశారు తమిళ అభిమానులు. సమంత, ప్రియమణి, మనోజ్‌ భాజ్‌పాయ్‌ ప్రధాన పాత్రధారులుగా రాజ్‌ అండ్‌ డీకే రూపొందించారు ఈ వెబ్‌ సిరీస్‌ని.