అక్కినేని వారి కోడలు సమంత గత కొన్నాళ్లుగా స్టార్ హీరోయిన్ గా కంటే మంచి నటిగానే గుర్తింపు తెచ్చుకుంటోంది. స్టార్ హీరోలతో బారి బడ్జెట్ సినిమాల్లో నటించడం కన్నా అన్ని తానై నడిచే లేడి ఓరియెంటెడ్ కథలను సెలెక్ట్ చేసుకుంటోంది. సమంత నుంచి మరో ప్రయోగాత్మక చిత్రం రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. 

జులై 5న 'ఓ బేబీ' సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సురేష్ ప్రొడక్షన్ - గురు ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకురాలు. సీనియర్ నటి లక్ష్మి చాలా రోజుల తరువాత ఈ సినిమా ద్వారా తెరపై మెరవనుంది. నాగ శౌర్య కీలకపాత్రలో నటించాడు. ఇక సినిమాపై చిత్ర యూనిట్ కాన్ఫిడెన్స్ గా ఉంది.

ఇప్పటికే సినిమా షూటింగ్ ముగిసింది. పాటలు పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ప్రమోషన్స్ డోస్ కూడా పెంచారు. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఓ బేబీ సినిమా కోసం చాలా వరకు లేడీస్ పని చేశారు. 2016లో కళ్యాణ వైభోగమే సినిమాకు దర్శకత్వం వహించిన నందిని రెడ్డి అనుకున్నంతగా మెప్పించలేదు. దీంతో ఓ బేబీ సినిమాతో సక్సెస్ అందుకోవాలని ఆమె కష్టపడుతున్నారు.