స్టార్‌ హీరోయిన్‌ సమంత తన అభిమానులకు ట్రీట్‌ ఇవ్వబోతుంది. తాను నటించిన కొత్త సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతుంది. తాజాగా ఈ విషయాన్ని చిత్రం బృందం ప్రకటించింది. 

సమంత(Samantha) తన అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఫ్యాన్స్ కి బెస్ట్ ట్రీట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. తాను నటిస్తున్న తెలుగు చిత్రం `శాకుంతలం`(Shaakuntalam) నుంచి ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేయబోతున్నారు. ఇందులో సమంత శకుంతలగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల 21న సోమవారం ఉదయం 9.30గంటలకు సమంత ఫస్ట్ లుక్‌(Shaakuntalam First Look)ని విడుదల చేయబోతున్నారు. దీంతో సమంత అభిమానులు `శాకుంతలం`లోని శకుంతల ఫస్ట్ లుక్‌ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 

Scroll to load tweet…

ఇక ఈ చిత్రానికి గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్‌ తనయ అల్లు అర్హ బాలనటిగా వెండితెరకి పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో సినిమాపై మరింత క్రేజ్‌ పెరిగింది. దేవ్‌ మోహన్‌ మేల్‌ లీడ్‌గా చేస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ గతేడాది పూర్తి చేసుకుంది. గ్రాఫిక్స్ కి ఎక్కువ స్కోప్‌ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ లో టీమ్‌ బిజీగా ఉంది. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తుంది యూనిట్‌. 

ఇక సమంత విషయానికి వస్తే ఆమె ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` చిత్రంతో బాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్‌ని ఏర్పర్చుకుంది. అంతకు ముందు సౌత్‌లో మెప్పించిన సమంత ఈ వెబ్‌ సిరీస్‌తో అన్నింట క్రేజీ హీరోయిన్‌గా మారింది. దీనికితోడు ప్రస్తుం సమంత సౌత్‌తోపాటు హిందీలో సినిమాలకు కమిట్‌ అయినట్టు తెలుస్తుంది. మరోవైపు ఓ ఇంటర్నెషనల్‌ ప్రాజెక్ట్ ని కూడా సమంత అనౌన్స్ చేసింది. దీంతో సమంత పాన్‌ ఇండియా హీరోయిన్‌ రేంజ్‌ని దాటేయబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

సమంత చివరగా ఓటీటీలో `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` వెబ్‌ సిరీస్‌తో కనువిందు చేసింది. ఇందులో రాజీ పాత్రలో మెప్పించింది. అద్భుతమైన యాక్షన్‌ ఎపిసోడ్స్ తో మెస్మరైజ్‌ చేసింది. సినిమా పరంగా `జాను` తర్వాత వెండితెరపై కనిపించలేదు. కానీ ఇటీవల అల్లు అర్జున్‌ హీరోగా నటించిన `పుష్ప` చిత్రంలో `ఊ అంటావా మావ.. ఊఊ అంటావా` పాటలో డాన్సు చేసి ఓ ఊపు ఊపేసిన విషయం తెలిసిందే.