చేస్తే డిఫరెంట్ గా కొత్తగా మంచి సినిమాలు చేయాలి లేకుంటే ఇంట్లో కూర్చోవాలి అంటూ ఇటీవల కామెంట్ చేసిన సమంత అన్నట్టుగానే కొత్త దారిలో అడుగులేస్తోంది. వీలైనంత వరకు కొత్త జానర్స్ ని టచ్ చేస్తోన్న అమ్మడు ప్రస్తుతం ఓ బేబీ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉంది. 

రెగ్యులర్ ప్రమోషన్స్ పాల్గొంటూ సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. అసలు విషయంలోకి వస్తే నెక్స్ట్ సమంత హారర్ కథను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజుగారి గది 2 అంతగా క్లిక్కవ్వకపోవడంతో ఈసారి ఆడియెన్స్ కి మంచి హారర్ థ్రిల్ ఇవ్వాలని అనుకుంటోంది. తమిళ్ లో నయనతారతో డోరా సినిమా చేసి సక్సెస్ అందుకున్న దర్శకుడు దాస్ రామస్వామి ఇటీవల సమంతకు ఒక కథను వివరించాడు. 

స్క్రీన్ ప్లే సూపర్బ్ గా ఉందని సామ్ దర్శకుడిపై నమ్మకంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. వీలైనంత త్వరగా కథను సెట్స్ పైకి తీసుకెళ్లాలని సమంత అడుగులు వేస్తోంది. ఇక సామ్ నటించిన ఓ బేబీ వచ్చే నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.