గత కొంత కాలంగా బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటున్న సమంత డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఇప్పుడు ప్రయోగాలు చేస్తోంది. ప్రస్తుతం భర్త నాగ చైతన్యతో రొమాంటిక్ లో లవ్ స్టోరీ మజిలీలో నటిస్తోన్న అక్కినేని కోడలు మరో కొరియన్ మూవీ రీమేక్ లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందులో 70 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో సమంత నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. 

అలాగే 20 ఏళ్ల యువతి పాత్రలో కూడా నటించేందుకు మొదట ఆమె ఒప్పుకుంది. కానీ ఇటీవల సినిమాకు సంబందించినక్ వర్క్ షాప్ లో పాల్గొన్న సమంత ముసలి పాత్ర చేయకూడదని నిర్ణయం తీసుకుందట. మొదటి నుంచి సమంత బామ్మలా కనిపిస్తే ఎలా ఉంటుందో అనే ఒక ఆసక్తి అందరిలో కలిగింది. అయితే సడన్ గా సమంత ఆ పాత్ర చేయడం లేదట. మళ్ళీ ఆ పాత్ర క్లిక్ అవ్వకపోతే ఇమేజ్ డ్యామేజ్ కావచ్చని అందుకే బయపడి వెనక్కి తగ్గినట్లు టాక్. 

దీంతో సీనియర్ నటి లక్ష్మిని ఆ పాత్ర కోసం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఒరిజినల్ కథలో కూడా ఇద్దరు నటీనటులు ఆ పాత్రలను చేశారు. వృద్ధురాలికి అలాగే మనవారికి సంబందించిన ఆ కొరియన్ కథకు లేడి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తిగా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా సినిమాను డిజైన్ చేస్తున్నారు, ఈ సినిమాలో నాగ శౌర్య కీలకపాత్రలో నటించనున్నాడు.