`నిన్ను కోరి` ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన `మజిలీ` సినిమా విశేష ఆదరణ పొందింది. మ్యారేజ్ తర్వాత సమంత, నాగచైతన్య కలిసి నటించిన తొలి చిత్రమిది. కలిసి నటించిన చివరి చిత్రం కూడా ఇదే.
స్టార్ కపుల్ నాగచైతన్య(Naga Chaitanya), సమంత(Samantha) కలిసి నటించిన సినిమా `మజిలీ`(Majili). ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్ట్రగుల్స్, ప్రేమలో విఫలమైన భర్త ప్రేమ కోసం తపించే ఓ ఇల్లాలు మానసిక సంఘర్షణ నేపథ్యంలో లవ్, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన `మజిలీ` సినిమా భారీ విజయాన్ని సాధించింది. `నిన్ను కోరి` ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2019, ఏప్రిల్ 5న విడుదల విశేష ఆదరణ పొందింది. మ్యారేజ్ తర్వాత సమంత, నాగచైతన్య కలిసి నటించిన తొలి చిత్రమిది. కలిసి నటించిన చివరి చిత్రం కూడా ఇదే.
దీంతో స్పెషల్‌గా నిలిచిన ఈ చిత్రంలో సమంత, నాగచైతన్య అద్భుతంగా నటించారు. తమ మెచ్యూరిటీ నటనని ప్రదర్శించి విశేష ప్రశంసలందుకున్నారు. ముఖ్యంగా చైతూ నటుడిగా తనలోని మరో స్థాయి నటన ప్రదర్శించాడనే కామెంట్స్ వచ్చాయి. కేవలం 20కోట్లతో రూపొందిన ఈ సినిమా ఏకంగా సుమారు రూ.70కోట్లు వసూలు చేసింది. తాజాగాఈ సినిమా విడుదలై మూడేళ్లు పూర్తి చేసుకుంది. మంగళవారంతో మూడేళ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా సమంత ఈ చిత్ర పోస్టర్ ని ఇన్‌స్టాస్టోరీస్‌లో పంచుకుంది. అయితే ఆమె కేవలం `#3yearsformajili` అనే యాష్ ట్యాగ్‌ని మాత్రమే పంచుకుంది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.
ఇదిలా ఉంటే సమంత.. నాగచైతన్యతో చేసిన చివరి `మజిలీ` ని గుర్తు చేసుకుంది. కానీ నాగచైతన్య మాత్రం దీనికి సంబంధించిన ఎలాంటి పోస్ట్ పెట్టకపోవడం గమనార్హం. ట్విట్టర్‌లోగానీ, ఇన్‌స్టాలోగానీ ఆయన స్పందించలేదు. ఈ నేపథ్యంలో దీనిపై ఇంటర్నెట్‌లో నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. చైతూ తన పాత జ్ఞాపకాలను అసలు గుర్తు చేసుకునే ఆలోచనలోనే లేన్నట్టున్నారంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఏదేమైనా ఎంతో అన్యోన్యంగా ఉండే నాగచైతన్య, సమంత విడిపోవడం అందరికీ బాధ కలిగించిన విషయం.
`ఏం మాయ చేసావె` చిత్రంతో కలిసిన సమంత, నాగచైతన్య దాదాపు ఏడేళ్ల తర్వాత 2017లో అక్టోబర్ 6న మ్యారేజ్ చేసుకున్నారు. సరిగ్గా నాలుగేళ్లు తర్వాత విడిపోతున్నట్టు ప్రకటించారు. వీరిద్దరు విడిపోవడానికి కారణం ఏంటనేది తెలియదు. ప్రస్తుతం సమంత తన కెరీర్‌వైపు ఫోకస్ పెట్టింది. వరుసగా సౌత్ టూ నార్త్, ఇంటర్నేషనల్ మూవీస్ చేస్తుంది. తెలుగులో `శాకుంతలం`, `యశోద` చిత్రాలు చేస్తుంది. మరోవైపు తమిళంలో `కాథు వాకుల రెండు కాదల్`, మరో బైలింగ్వల్ సినిమా, అలాగే `అరెంజ్‌మెంట్ ఆఫ్ లవ్` అనే ఇంటర్నేషనల్ మూవీ చేస్తుంది. ఇందులో ఆమె బై సెక్సువల్ అమ్మాయిగా కనిపించనుందని టాక్.
