అక్కినేని కోడలు సమంత పెళ్లి అనంతరం కమర్షియల్ సినిమాలకంటే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ,మరోసారి అర్థమైంది. నందిని రెడ్డి దర్శకత్వంలో కొరియన్ సినిమా మిస్ గ్రానీ కథ ఆధారంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ఓ బేబీ. మిస్ గ్రానీ గా సీనియర్ యాక్టర్ లక్ష్మి సినిమాలో కనిపించనున్నారు. 

ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ పార్ట్ మొత్తం సమంత పూర్తి చేసింది. చిత్ర యూనిట్ అనుకున్న సమయం కంటే చాలా వేగంగా షూటింగ్ ను పూర్తి చేసింది. అలా మొదలైంది సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నందిని రెడ్డి ఈ సినిమాతో డిఫరెంట్ హిట్టందుకోవడం పక్కా అని తెలుస్తోంది. 

అయితే గతంలో సమంత - సిద్దార్థ్ కాంబినేషన్ లో నందిని రెడ్డి తెరకెక్కించిన జబర్దస్త్ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడమే కాకుండా సినిమా కథ కాపీ అంటూ టాక్  బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అఫీషియల్ గా చేసిన ఈ రీమేక్ లో సమంత మరో ట్రెండ్ సెట్ చేయడం పక్కా అని టాక్ వస్తోంది.  సురేష్ బాబు నిర్మిస్తోన్న ఈ సినిమా సమ్మర్ మిడ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.