Asianet News TeluguAsianet News Telugu

దుబాయ్ లో సమంత సందడి, ఎందుకు వెళ్లింది..? ఏం చేస్తోంది..? ఎవరిని కలిసింది..?

దుబాయ్ లో తెగ సందడి చేస్తోంది చెన్నై సుందరి సమంత. నాగచైతన్యతో విడాకులు తరువాత సమంత ప్రీ బార్డ్ అయ్యింది. ఇంతకీ సమంత చెన్నై ఎందుకు వెళ్లింది..? అక్కడ ఏం చేస్తోంది. 

Samantha Meets  Special Person in Dubai
Author
Hyderabad, First Published Jun 27, 2022, 6:37 PM IST

దుబాయ్ లో తెగ సందడి చేస్తోంది చెన్నై సుందరి సమంత. నాగచైతన్యతో విడాకులు తరువాత సమంత ప్రీ బార్డ్ అయ్యింది. ఇంతకీ సమంత చెన్నై ఎందుకు వెళ్లింది..? అక్కడ ఏం చేస్తోంది. 

సమంత బిజీ బిజీ షూటింగ్స్ గ్యాప్ లేకుండా చేస్తోన్న బ్యూటీ... కాస్త ఖాళీ దొరికితే.. ఇంటిపట్టునే ఉండకుండా విహారయాత్రలు చేస్తోంది. నచ్చిన ప్లేస్ కు వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. ఫ్రెండ్స్ తో కలిసి తన టైమ్ ను హ్యాపీగా గడిపేస్తోంది. 

చెన్నై సోయ‌గం స‌మంత  ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. తెలుగు, హిందీ సినిమాల‌తో తీరిక లేకుండా ఉన్న ఈ భామ ఇప్పుడెక్క‌డుందో తెలుసా..? ఈ బ్యూటీ దుబాయ్ కి వెళ్లింది. త‌న స్నేహితురాలు శిల్పారెడ్డి  తోపాటు ఆమె సోద‌రి సాహిత్య రెడ్డితో ఎంజాయ్ చేస్తోంది. 

 

వీరంతా క‌లిసి ఒక్క‌చోట సంద‌డి చేసిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.ఈ స్టిల్‌ను శిల్పారెడ్డి ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ..ఫైన‌ల్‌గా ఊహించ‌ని విధంగా నా సోద‌రి సాహిత్య ను సామ్ క‌ల‌వ‌డం, సామ్‌ను సాహిత్య మీట్ అవ‌డం అద్బుతం. నా ఇద్ద‌రు ఫేవ‌రేట్  మహిళలు. దేవా ఎప్పుడూ సామ్ ఆంటీని కలుసుకోవడం చాలా సరదాగా ఉంటుంది..అంటూ #dubaidaires హ్యాష్ ట్యాగ్‌ను జ‌త‌చేసింది శిల్పారెడ్డి. స‌మంత‌తో క‌లిసి దిగిన మ‌రో ఫొటోను షేర్ చేస్తూ..దుబాయ్‌లో మేము ఎవరిని కలుసుకునే అవకాశం ఉందో ఊహించండి చూద్దాం..అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది శిల్పారెడ్డి.

ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌, శివ‌నిర్వాణ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఖుషీ చిత్రంలో న‌టిస్తోంది స‌మంత‌. దీంతోపాటు గుణ‌శేఖ‌ర్ డైరెక్ష‌న్‌లో చేస్తున్న శాకుంత‌లం రిలీజ్ కు రెడీగా ఉంది. మ‌రోవైపు ఫీ మేల్ సెంట్రిక్ ప్రాజెక్టు య‌శోద‌లో న‌టిస్తోంది. ఇవే కాకుండా హాలీవుడ్ ప్రాజెక్టు Arrangement of Love సినిమాలో కూడా న‌టిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios