అ! అనే సినిమాతో నిర్మాత‌గా మంచి హిట్ కొట్టిన హీరో  నాని మరో కధా బలం ఉన్న చిత్రం ప్రొడ్యూస్ చేయబోతున్నారు. బాహుబలి  రైటర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పిన లేడీ ఓరియెంటెడ్ కథకి ఇంప్రెస్ అయ్యి ఈ ప్రాజెక్టు ఓకే చేసారని సమాచారం.  ఇక ఈ చిత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ కథగా నడవనుంది. తనకున్న పరిచయంతో సమంతను ఒప్పించి ఈ ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించబోతున్నారు. 

ఇప్పటికే ఈ కధ ని విన్న సమంత వెంటనే ఓకే చేసిందిట. త్వ‌ర‌లోనే ఈ సినిమాపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డ‌నుంది. ఇక ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నాని కానీ మరో యంగ్ హీరో కానీ కనిపించనున్నారు. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తైన ఈ చిత్రం ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ లో బిజీగా ఉంది. 

నాని- స‌మంత క‌లిసి ఈగ‌, ఎటో వెళ్ళిపోయింది మ‌న‌సు చిత్రాల‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం నాని జెర్సీ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. నిన్న జెర్సీ  టీజ‌ర్ రిలీజ్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. 

మరో ప్రక్క నాగ చైత‌న్య‌ని వివాహం చేసుకొని అక్కినేని కోడ‌లిగా ప్ర‌మోష‌న్ పొందిన స‌మంత గ‌త ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్స్ లో కనిపించింది. ఈ ఏడాది కూడా అదే హ‌వాని కొన‌సాగించాల‌ని అనుకుంటుంది. ప్ర‌స్తుతం తన భ‌ర్త‌తో క‌లిసి మ‌జిలీ అనే సినిమా చేస్తోంది.  అలాగే నందినీ రెడ్డి తో మిస్ గ్రానీ కొరియా రీమేక్ చేస్తోంది.