ముప్పై ఏళ్ల కెరీర్ లో సల్మాన్ అరడజను హీరోయిన్స్ తో డేటింగ్ చేశారు. వీరందరూ ప్రముఖంగా వినిపించినవారు మాత్రమే. అనధికారికంగా చూస్తే ఈ లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది.తాజాగా సల్మాన్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ లోకి మరో అందాల భామ వచ్చి చేరింది.

బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఎవరంటే టక్కున సల్మాన్ ఖాన్ (Salman Khan) పేరు చెప్పేస్తారు. ఐదు పదులు దాటినా ఈ స్టార్ హీరో పెళ్లి మాటెత్తడం లేదు. ఇకపై పెళ్లి చేసుకుంటారనే నమ్మకం కూడా లేదు. అలాగని సల్మాన్ ఫక్తు బ్రహ్మచారి, ఆడగాలంటే ఇష్టపడని ప్రవరాఖ్యుడు అనుకుంటే పొరపాటే. ముప్పై ఏళ్ల కెరీర్ లో సల్మాన్ అరడజను హీరోయిన్స్ తో డేటింగ్ చేశారు. వీరందరూ ప్రముఖంగా వినిపించినవారు మాత్రమే. అనధికారికంగా చూస్తే ఈ లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. 

సినిమాల్లోకి అడుగుపెట్టాడో లేదో అమెరికన్ భామ సోమి అలీతో రిలేషన్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత సంగీత బిజ్లానీతో ఎఫైర్ నడిపారు. ఆమెను వివాహం చేసుకోబోతున్నట్లు అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. కొన్నాళ్లు ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) తో డేటింగ్ చేశారు. ఈ క్రమంలో ఐశ్వర్యకు సల్మాన్ చుక్కలు చూపించాడు. అప్పట్లో సల్మాన్ పై ఐశ్వర్య తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే సల్మాన్ డేటింగ్ చేసిన హీరోయిన్స్ లిస్ట్ లో కత్రినా కైఫ్ (Katrina Kaif), ఫరియా అలమ్, లులియా వాంటూర్ ఉన్నారు. ఇలా స్వదేశం, విదేశం అనే తేడా లేకుండా సంబంధాలు నెరిపారు. శ్రీలంక భామ జాక్విలిన్ తో కూడా సల్మాన్ కి సంథింగ్ సంథింగ్ అంటూ పుకార్లు ఉన్నాయి. ఫస్ట్ లాక్ డౌన్ మొత్తం ఆమె సల్మాన్ తో పాటు ఆయన ఫార్మ్ హౌస్ లో ఏకాంతంగా గడిపారు.

తాజాగా సల్మాన్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ లోకి మరో అందాల భామ వచ్చి చేరింది. అమెరికన్ నటి, మోడల్ సమంత లాక్ వుడ్ తో సల్మాన్ డేటింగ్ చేస్తున్నారట. వీరిద్దరు సీక్రెట్‌ గా ఎఫైర్ నడుపుతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అంతేగాక సమంత లాక్‌వుడ్‌ కూడా సల్మాన్‌, అతడి ఫ్యామిలీ ఫంక్షన్స్‌కు హజరవ్వడంతో పాటు సన్నిహితంగా ఉంటున్నారు.

 ఇటీవల ఓ ఇంటర్య్వూలో సల్మాన్‌తో తన రిలేషన్‌పై తొలిసారిగా సమంత (Samantha)స్పందించారు. ఆమె సల్మాన్ తో ఎఫైర్ వార్తలను ఖండించారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ‘‘ప్రజలు చాలా మాట్లాడుతుంటారు. లేని దాని గురించి చాలానే చెప్పగలరు. నేను సల్మాన్ ఖాన్‌ తో కలుసుకున్నాను. ఆయన మంచి వ్యక్తి. చెప్పడానికి ఇంతకు మించి ఏమీ లేదు. ప్రజలకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో నాకు తెలియదు. నేను కలవడం అంటే.. హృతిక్ రోషన్‌ కూడా కలుసుకున్నాను. కానీ, నా గురించి, హృతిక్ గురించి ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఈ వార్తలు ఎక్కడ నుంచి వచ్చాయో తెలియడం లేదు’’ అని స్పష్టం చేసింది. 

. కాగా సమంత ‘షూట్ ది మూవీ’తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆమె హిందీ పరిశ్రమలో స్టార్ హీరోగా సెటిల్ కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సల్మాన్ లాంటి హీరో అండ ఉంటే అదంత కష్టమైన విషయం కాదు. ఆయన ఒక్క మాట చెబితే ఆఫర్ కాఫీ కప్పులా అందించే దర్శక నిర్మాతలు ఎందరో ఉన్నారు.