వివాహం తర్వాత చాలా మంది హీరోయిన్స్ సినిమా పరిశ్రమకు దూరం అవుతారు. అయితే సమంత వీరందరికీ డిఫరెంట్. వివాహానంతరం మరింత ఫిట్ గా తయారవుతోంది. మరింత ఉత్సాహంగా వరస సినిమాలు చేస్తోంది. డిఫరెంట్ సినిమాలతో దూసుకుపోతుంది. ఎక్కువగా పర్ఫామెన్స్‌కు స్కోప్‌ ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ వస్తోంది. ఆమె ఫిట్నెస్ చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఆమె ఇన్స్ట్రగ్రమ్ లో పెట్టిన ఫొటో చూసిన వారంతా నోరు వెళ్లబెడుతున్నారు. మీరూ ఈ ఫొటో చూస్తే ఆశ్చర్యపోతారు. క్రింద చూడండి.

ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి పిరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న మజిలిలో నటిస్తున్న ఈ బ్యూటీ నందిని రెడ్డి దర్శకత్వంలో ప్రయోగాత్మక చిత్రానికి ఓకె చెప్పింది. ఈ సినిమా సమంత 70 ఏళ్ల వృద్ధురాలిగా కనిపించనుందన్న టాక్‌ గట్టిగా వినిపించింది. కొరియన్‌ సినిమా మిస్‌ గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

మరో ప్రక్క తమిళ బ్లాక్‌బస్టర్‌ ‘96’ తెలుగులో రీమేక్‌  కమిటైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్, సమంత జంటగా నటించనున్నారు. తమిళ చిత్రాన్ని డైరెక్ట్‌ చేసిన సి.ప్రేమ్‌ కుమార్‌ ఈ చిత్రానికీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. ‘దిల్‌’ రాజు నిర్మాత. 

తమిళ ‘96’ స్క్రిప్ట్‌ను తెలుగు నేటివిటీకు తగ్గట్టు పలు మార్పులు చేశారట. చిన్ననాటి స్నేహితులంతా మళ్లీ కలుసుకోవడం అనే కాన్సెప్ట్‌తో చిత్రకథ సాగుతుంది. రెండు, మూడు డిఫరెంట్‌ గెటప్స్‌లో శర్వానంద్, సమంత కనిపిస్తారు.