జనగామ జిల్లా గుండాలలో సమంత చేనేత కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్న సమంత తెలంగాణ ప్రభుత్వం చేనేత బ్రాండ్ ఎంబాజిడర్ గా వ్యవహరిస్తున్న సమంత

సినీ నటి, తెలంగాణ ప్రభుత్వ చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌ సమంత జనగామ జిల్లా గుండాలలో పర్యటించింది. ఇక్కడ తయారయ్యే దోమ తెరలకు మంచి పేరుంది. చేనేత రంగ నిపుణులతో ఇక్కడి వచ్చిన సమంత స్థానిక కార్మికులతో మాట్లాడింది.

దోమ తెరలతోపాటు చీరలను కూడా నేస్తే గిట్టుబాటు అవుతుందా అనే విషయాన్ని వారితో చర్చించింది. కూలి గిట్టుబాటు కావటానికి తీసుకోవాల్సిన చర్యలను అడిగి తెలుసుకుంది. దాదాపు గంటపాటు చేనేత కార్మికులతో గడిపింది.