సమంత హిమాలయ సానువులలో గల పవిత్ర దైవ క్షేత్రాలను దర్శిస్తున్నారు. గంగోత్రి, యమునోత్రి, బద్రినాధ్ వంటి ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఈ డివోషనల్ టూర్ కి కూడా శిల్పారెడ్డితో సమంత వెళ్లడం జరిగింది. 

సమంత వరుసగా విహార, ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నారు. ఇటీవల డెహ్రాడూన్ టూర్ వెళ్లిన Samantha అక్కడ ఓ వారం రోజులు గడిపారు. తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పారెడ్డితో సమంత డెహ్రాడూన్ వెళ్లడం జరిగింది. తాజాగా సమంత హిమాలయ సానువులలో గల పవిత్ర దైవ క్షేత్రాలను దర్శిస్తున్నారు. గంగోత్రి, యమునోత్రి, బద్రినాధ్ వంటి ప్రదేశాలను సందర్శిస్తున్నారు. 

ఈ డివోషనల్ టూర్ కి కూడా శిల్పారెడ్డితో సమంత వెళ్లడం జరిగింది. గంగోత్రి దర్శనం ముగించుకున్న వీరిద్దరూ యమునోత్రికి వెళుతున్నారట. ప్రత్యేక హెలికాప్టర్ లో Yamunotriకి వెళుతున్నట్లు శిల్పా రెడ్డి ఓ ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. దీనితో సమంత తాజా టూర్ కి సంబంధించిన సమాచారం బయటికి వచ్చింది. 

Also read సమంత పరువు నష్టం దావా: కోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రేపటికి వాయిదా
చైతూతో దూరంగా ఉంటునప్పటి నుండి సమంత శిల్పా రెడ్డి కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. విడాకుల ప్రకటనకు ముందు కూడా సమంత Shilpa reddy ఫ్యామిలీతో గోవా ట్రిప్ కి వెళ్లడం జరిగింది. విడాకుల వలన ఏర్పడిన మానసిక వేదన, ఒత్తిడి నుండి బయటపడడం కోసం సమంత ఇలా వరుస టూర్స్ కి వెళుతున్నారు. 

Also read డైవర్స్ తర్వాత సమంత ఫస్ట్ ఇంటర్వ్యూ..అసలు విషయాలను దాస్తూ.. సోషల్‌ మీడియాపై వ్యాఖ్యలు
సమంత Naga chaitanya విడాకుల విషయంలో కొన్ని మీడియా ఛానళ్ల దుష్ప్రచారం సమంతను కోపానికి గురిచేసింది. సమంత గురించి తప్పుడు కథనాలు ప్రసారం చేసిన మూడు యూట్యూబ్ ఛానళ్లకు ఆమె నోటీసులు పంపారు. వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకునే పనిలో సమంత లాయర్లు ఉన్నారు. ఇక కొత్త చిత్రాల ప్రకటన చేస్తున్న సమంత, దసరా రోజు ఓ మూవీపై అధికారిక ప్రకటన చేశారు. మరిన్ని కొత్త సినిమాలను సమంత త్వరలో ప్రకటించనున్నారని సమాచారం. 

View post on Instagram