Asianet News TeluguAsianet News Telugu

బ్రేకప్ తర్వాత రెమ్యునరేషన్ పెంచేసిన సమంత.. చాలా దూరంలో పూజ, రష్మిక ?

సమంత తన రెమ్యునరేషన్ పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సమంత సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ల జాబితాలో ఉంది.

Samantha Hikes her Remuneration
Author
Hyderabad, First Published Nov 5, 2021, 9:43 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సమంత సౌత్ లో తిరుగులేని హీరోయిన్. నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత ఎక్కువగా వార్తల్లో నిలిచింది. వీళ్లిద్దరి బ్రేకప్ అభిమానులు ఊహించని షాక్ లా మిగిలిపోయింది. తన వ్యక్తిగత జీవితంలో చేదు అనుభవాలను మరచిపోయి వర్క్ లో బిజీ కావాలని భావిస్తోంది సమంత. ప్రస్తుతం సమంత వరుసగా కొత్త ప్రాజెక్ట్స్ ని ఒకే చేసే పనిలో ఉంది. 

Samantha తన రెమ్యునరేషన్ పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సమంత సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ల జాబితాలో ఉంది. తాజాగా ఆమె రెమ్యునరేషన్ పెంచేయడంతో నిర్మాతలకు కాస్త నిరాశగా మారింది. సాధారణంగా సమంత ఒక చిత్రానికి రూ 3 కోట్లకంటే కొంచెం తక్కువగానే రెమ్యునరేషన్ తీసుకుంటుంది. కానీ ప్రస్తుతం సమంత జీఎస్టీ కాకుండా 3 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read: దివాళీ వేళ రెచ్చిపోయిన చూపించిన రాశి ఖన్నా... రెడ్ చోళీ లెహంగాలో నడుము, నాభీ చూపిస్తూ రచ్చ!

జోరు మీద ఉన్న Pooja Hegde, రష్మిక కూడా 2.5 కోట్ల లోపే పారితోషికం తీసుకుంటున్నారు. దీనితో సమంతతో సినిమా చేయాలని భావించే నిర్మాతలు ప్రత్యామ్నాయం చూసుకునే అవకాశం లేకపోలేదు. ఇటీవల నాని ' దసరా' చిత్రాన్ని ప్రకటించారు. చిత్రంలో నానికి జోడిగా సమంతతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కానీ సామ్ పారితోషికం హైక్ చేయడంతో మరో నిర్మాతలకు కాస్త ఇబ్బందిగా మారింది. 

చైతో బ్రేకప్ తర్వాత సమంత గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతోంది. తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేసిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై కోర్టులో పరువునష్టం దావా కూడా వేసింది సమంత. కోర్టులో సమంతకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. కానీ సామ్ మాత్రం సోషల్ మీడియాలో పరోక్షంగా అర్థం వచ్చేలా చైతో బ్రేకప్ గురించి అనేక కామెంట్స్ పోస్ట్ చేస్తోంది. తన స్నేహితులతో తీర్థయాత్రలకు వెళుతోంది. మరోవైపు తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో కూడా ప్లాన్ చేసుకుంటోంది. 

Also Read: మహేష్ ఫ్యామిలీకి దీపావళి గిఫ్ట్స్ పంపిన పవన్ కళ్యాణ్ దంపతులు.. నమ్రత రియాక్షన్

లేడి ఓరియెంటెడ్ చిత్రంలో నటించినా.. తన నటనతో ఆ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ సక్సెస్ చేయగల సత్తా సమంతకు ఉంది. అందుకు ఉదాహరణ 'ఓ బేబీ' మూవీ. ఇక  ఫ్యామిలీ మ్యాన్ 2 లో సమంత రాజి పాత్రకు విశేషమైన స్పందన లభించింది. ఇకపై సామ్ బాలీవుడ్ లో కూడా నటించే విధంగా ప్లాన్ చేసుకుంటోంది. 

ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంత దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రస్తుతం సమంత తమిళంలో ఓ చిత్రంలో నటిస్తోంది. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే పౌరాణిక చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీలో ఇప్పటికే సమంత పార్ట్ షూటింగ్ పూర్తయింది. దుశ్యంతుడు, శకుంతల కథని గుణశేఖర్ వెండితెరపై విజువల్ వండర్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 

Also Read: Unstoppable With NBK: చిరంజీవి పెళ్లిపై మోహన్ బాబు కామెంట్స్ వైరల్.. కాబట్టే బాగున్నాడు అంటూ..

Follow Us:
Download App:
  • android
  • ios