దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దీపాల వెలుగులతో ఇండియా మొత్తం పండుగ శోభ కనిపిస్తోంది. సెలెబ్రిటీలు కూడా దీపావళిని ఎవరి స్టైల్ లో వారు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. 

దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దీపాల వెలుగులతో ఇండియా మొత్తం పండుగ శోభ కనిపిస్తోంది. సెలెబ్రిటీలు కూడా దీపావళిని ఎవరి స్టైల్ లో వారు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. దీపావళి పర్వదినాన ఓ విశేషమైన సంఘటన చోటు చేసుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పవర్ స్టార్ Pawan Kalyan.. సూపర్ స్టార్ Mahesh Babu ఫ్యామిలీకి దీపావళి గిఫ్ట్స్ పంపారు. మీరు విన్నది నిజమే.. స్వయంగా పవన్ కళ్యాణ్ , అన్నా లెజినోవా దంపతులు మహేష్ బాబు ఫ్యామిలీకి దీపావళి కానుకలు పంపారు. పవన్ పంపిన గిఫ్ట్స్ లో స్వీట్స్, టపాకాయలు లాంటివి ఉన్నాయి. 

ఈ క్రేజీ న్యూస్ ని మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేశారు. థాంక్యూ అన్నా, పవన్ అని కామెంట్ పెట్టారు. ఈ సంగతి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ లో పవన్, మహేష్ టాప్ స్టార్స్ గా కొనసాగుతున్నారు. వారిద్దరి మధ్య ఇంతటి మంచి విశేషం జరిగితే ఇరు హీరోల అభిమానులకు సంతోషమే. 

అలాగే దర్శకుడు హరీష్ శంకర్, క్రిష్ జాగర్లమూడి లకు కూడా పవన్ దంపతులు దీపావళి శుభాకాంక్షలతో కానుకలు పంపారు. పవన్ కళ్యాణ్ త్వరలో హరీష్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' అనే చిత్రంలో నటించాల్సి ఉంది. అలాగే క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. ఈ సంక్రాంతికి పవన్, రానా కలసి నటిస్తున్న భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ కానుంది.