టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా సమంత ఎంత గుర్తింపు తెచ్చుకుందో గాని మనసున్న మనిషిగా మాత్రం సినీ హీరోయిన్స్ లో అందరిని మించిపోతుందనే చెప్పాలి. చిన్నారులకు గుండె సంబందిత శాస్త్ర చిక్కిత్సలను చేయించి ఒక పెద్ద సేవా సంస్థను నడుపుతున్న ఆమె రీసెంట్ గా మరో మంచి పని చేసి మహారాణి అనిపించుకున్నారు. 

క్రిస్మస్ సందర్బంగా అందరిలో ఆనందాన్ని నింపాలని అదే తరహాలో ఎయిడ్స్ బారిన పడిన చిన్నారులకు కూడా సంతోషాన్ని అందించింది. ఒక సంస్థలో ఉన్న చిన్నారులను షాపింగ్ మాల్ కు తీసుకెళ్లి వారికి నచ్చిన దుస్తులను ఎంచుకోమంది. అందరూ రెండేసి మూడేసి జతలు కొనుక్కోగా వారి సంతోషం చూసి ఖర్చులంతా సమంతానే భరించింది.

 

అంతే కాకుండా వారితో కలిసి డ్యాన్స్ చేసి చాలా సేపు తన మాటలతో పిల్లల్లో ఒక ఆహ్లాదకర వాతావరణాన్ని నెలకొల్పారు. అందుకు సంబందించిన పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో షేర్ చేసుకుంది. క్రిస్మస్ రోజు భర్తతో ఆనందంగా గడపడమే కాకుండా ఈ విధంగా చిన్నారుల కళ్ళల్లో ఆనందాన్ని నింపి అక్కినేని కుటుంబం యొక్క స్థాయిని మరింత పెంచింది. ఇక నెటిజన్స్ కూడా అమ్మడిని పొగుడుతున్నారు. అందుకే సమంతను నెంబర్ వన్ హీరోయిన్ అంటరాని ఆమెకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.