అక్కినేని నాగార్జున తన కోడలుతో చాలా సరదాగా ఉంటారు. వీళ్లిద్దరు కలిసి పనిచేసిన రాజుగారి గది 2 సినిమా యావరేజ్ అయినా మంచి పేరు తెచ్చి పెట్టింది. అలాగే ఇద్దరూ తమ తమ కెరీర్ బిజీలో ఉన్నారు. సినిమాలు చేస్తూనే యాడ్స్ చేస్తున్నారు. తాజాగా సమంత చేసిన యాడ్ ...నాగ్ చేసిన యాడ్ కు పూర్తి కౌంటర్ లా ఉండటం అంతటా చర్చనీయాంశంగా మారింది.

నాగార్జున ఘడీ డిటర్జెంట్ కు బ్రాండ్ అంబాసిడర్. రెండేళ్లనుంచి నాగ్ కు సంబంధించిన యాడ్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సమంత సంస్కారవంతమైన xxx బట్టల సోప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. . ఇప్పుడు వీరిద్దరి యాడ్స్ టీవీల్లో పక్కపక్కనే వస్తున్నాయి. 

నాగార్జున ఘడీ డిటెర్జెంట్ సోప్ గురించి చెప్తూ..వాడి చూడండి..తర్వాత నమ్మండి అని స్లోగన్ ఇస్తారు. అయితే దానికి కౌంటర్ అన్నట్లుగా సమంత త్రిబుల్ ఎక్స్ సోప్ గురించి చెప్తూ..  30 సంవత్సరాలుగా నమ్ముతున్న  సబ్బు..దీనికి ఏ ల్యాబ్ టెస్ట్ లు అక్కర్లేదు అంటుంది. ఇలా నాగ్ చెప్పిన దానికి కౌంటర్ గా చెప్తుంది. అయితే ఇది ప్రొపిషనల్ గా కాబట్టి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మధ్యలో నాగ చైతన్య కూడా ఇలాంటి యాడ్ ఏదన్నా చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. 

ఇదిలా ఉంటే నాగార్జున తాజా చిత్రం మన్మధుడు 2లో సమంత కూడా నటిస్తుందని టాక్ వినబడుతుంది. సమంత ఒక గెస్ట్ రోల్ చేయబోతోందని.. మామ నాగార్జున, ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్ కోసం ఆ రోల్ ఒప్పుకున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే మజిలీ సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చిన సమంత… నందినీరెడ్డి మిస్ గ్రానీ లో, దిల్ రాజు తమిళ రీమేక్ 96 లో నటిస్తుంది. తాజాగా మామ కోసం ఈ స్పెషల్ రోల్ కూడా చేయబోతుంది.  .