`మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`పై సమంత, దర్శకుడు గోపీచంద్ మలినేని రివ్యూ.. ఏం చెప్పారంటే..
అనుష్క, నవీన్ పొలిశెట్టి కలిసి నటించిన `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` చిత్రంపై స్టార్ హీరోయిన్ సమంత, దర్శకుడు గోపీచంద్ మలినేని తమ రివ్యూని వెల్లడించారు. సినిమాపై ప్రశంసలు కురిపించారు.

అనుష్క, నవీన్ పొలిశెట్టి కలిసి నటించిన కామెడీ మూవీ `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`. మహేష్‌బాబ పి దర్శకత్వం వహించిన చిత్రమిది. యూవీ క్రియేషన్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. ఈ చిత్రం ఈ గురువారం విడుదలైంది. కామెడీ, ఎమోషనల్ ఎంటర్ టైనర్‌గా మంచి ప్రశంలందుకుంది. పాజిటివ్ టాక్‌తో రన్ అవుతుంది. అటు కమర్షియల్‌గానూ అలరిస్తుంది, సెలబ్రిటీలను సైతం మెప్పిస్తుంది.
ఇప్పటికే సినిమాపై రాజమౌళి ప్రశంసలు కురిపించారు. నవ్వులు పూయించే చిత్రమని, తాను బాగా ఎంజాయ్ చేశానని తెలిపారు. నవీన్ పొలిశెట్టికి, అనుష్కకి, దర్శకుడికి అభినందనలు తెలిపారు. తాజాగా సమంత రియాక్ట్ అయ్యింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ చిత్రపై ప్రశంసలు కురిపించింది. తాను బాగా ఎంజాయ్ చేసిన చిత్రమంటూ ఆమె ప్రశంసలు కురిపించడం విశేషం.
ఇందులో సమంత చెబుతూ, ఇటీవల కాలంలో ఏ సినిమా నన్ను ఇంతగా నవ్వించలేదు. సినిమాలో అనుష్క ఛార్మింగ్‌గా కనిపించింది. నవీన్ పొలిశెట్టి సూపర్బ్ గా నటించాడు. `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` టీమ్ అందరికి అభినందనలు అని పేర్కొంది. దీంతో ప్రస్తుతం సమంత పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. మరోవైపు దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ప్రశంసలు కురిపించారు. సినిమాని చాలా ఎంజాయ్ చేశానని, తన కామెడీ టైమింగ్‌తో నవీన్ అత్యద్భుత నటనతో అందరిని దొంగిలించాడని, అనుష్క అద్భుతమైన నటనతో అదరగొట్టిందని, దర్శకుడు మహేష్‌కి అభినందనలు తెలిపారు దర్శకుడు గోపీచంద్.
సినిమా ఆద్యంతం నవ్వులు పూయించేలా సాగుతుంది. ఇక సినిమాలో కామెడీ, ఎమోషన్స్ మాత్రమే కాదు, లవ్, రొమాంటిక్ ట్రాక్ సైతం హైలైట్గా నిలుస్తుంది. చివర్లో అదే హైలైట్‌గా నిలవడం విశేషం. ఇందులో నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా నటించారు. ఆయన స్టాండప్ కామెడీ నవ్వులు పూయించింది. దీనికితోడు అనుష్కతో లవ్ ట్రాక్ అదరగొడుతుంది. మరోవైపు అనుష్క పాపులర్ చెఫ్‌గా కనిపిస్తుంది. ఆమె పెళ్లి కాకుండా స్పెర్మ్(వీర్యం) డోనర్ ద్వారా గర్భం దాల్చాలనుకుంటుంది. మరి ఆమె అలా చేయడానికి కారణమేంటి? అందుకు నవీన్ పొలిశెట్టిని ఎంచుకోవడానికి కారణం ఏంటి? అనేది సినిమా. ఆద్యంతం కామెడీగా సాగే ఈ మూవీ చివర్లో హృదయాన్ని బరువెక్కిస్తుంది. ఆ లవ్ ట్రాక్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.