క్రేజీ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం ఓ బేబీ. నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత లీడ్ రోల్ లో నటించింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని జులై 5న రిలీజ్ చేయనున్నారు. 70 ఏళ్ల వృద్ధురాలు ఓ మిస్టరీ ఫోటో స్టూడియోలోకి వెళ్లి 20 ఏళ్ల యువతిగా తిరిగొస్తుంది. ఈ ఆసక్తికరమైన కథాశంతో చిత్రాన్ని రూపొందించారు. 

తమిళంలో సమంత పాత్రకు ప్రముఖ సింగర్ చిన్మయి డబ్బింగ్ చెప్పింది. దీనిపై చిన్మయి స్పందిస్తూ చాలా కాలం తర్వాత తమిళంలో డబ్బింగ్ చెప్పడం సంతోషంగా ఉందని ట్వీట్ చేసింది. చిన్మయి ట్వీట్ పై మహిళా నెటిజన్ స్పందిస్తూ నందిని రెడ్డి, సమంత కాంబోలో వస్తున్నా ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని ట్వీట్ చేసింది. 

సదరు మహిళా ట్వీట్ పై ఓ ఆకతాయి నెగిటివ్ గా వ్యాఖ్యలు చేశాడు. ఓహో.. ఫెమినిస్టులు అంతా ఇక్కడే ఉన్నారుగా.. ఓ బేబీ సినిమా ఫ్లాప్ అవడం ఖాయం అని కామెంట్ చేశాడు. అతడి కామెంట్ గమనించిన సమంత సరైన విధంగా బుద్ది చెప్పింది. థాంక్యూ.. ప్రపంచంలో ఓ ఇడియట్ ఇతడు. ప్రపంచానికి ఓ ఇడియట్ పరిచయం అయ్యాడు అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.