మొదటిసారి బిగ్ బాస్ హోస్ట్ గా సమంత మారనుంది. నేడు సాయంత్రం ప్రసారం కానున్న బిగ్ బాస్ షోలో సమంత వ్యాఖ్యాతగా ఎంట్రీ ఇవ్వనున్నారు. దసరా సంధర్భంగా ప్రసారం కానున్న నేటి షోలో రంగస్థలం సినిమాలోని ...ఎంత చక్కగున్నావే లచ్చిమి సాంగ్ తో సమంత ఎంట్రీ ఇచ్చారు. ఇక రావడంతోనే సమంత తన పంచ్ ల పవర్ చూపించింది. 

అందరికీ పండగ శుభాకాంక్షలు చెప్పిన సమంత...షి ఈజ్ కూల్ అంటూ పొగడగా...ఆరియానా సంతోషంతో డాన్స్ వేసింది. ఇక అఖిల్ డ్రెస్ బాగుంది అంటూనే, గుజరాతి స్టయిలా అని మోనాల్ ని ఉద్దేశించి సెటైర్ వేశారు. దానికి అఖిల్ నవ్వుకున్నాడు. ఇక ఇంటిలో అందరితో మంచిగా ఉంటున్న నోయల్ మంచి తనం గురించి అడిగారు సమంత. ఎప్పటికైనా మంచి తనమే గెలుస్తుంది కదా మేడం అని నోయల్ సమాధానం చెప్పాడు. 

కాగా సమంత అవినాష్ కోపం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. నేను మనిషినే కద మేడం...నాకు కోపం వస్తుంది అన్నాడు అవినాష్. నా కోపం మేటర్ మీవరకు వచ్చిందా అని అవినాష్ సందేహం వ్యక్తం చేయగా...అసలు అది ట్రెండింగ్ టాపిక్ అన్నారు. కాగా నీ స్ట్రెంగ్త్ ఏమిటని సమంత అవినాష్ ని అడిగింది. దానికి అతడు ప్రేక్షకులే నా స్ట్రెంగ్త్ అన్నాడు. ఆ ఆన్సర్ నచ్చని సమంత ఆలోచించుకోవడానికి టైం కూడా లేదు  కదా అన్నారు. దానికి అవినాష్ అవును మేడం టైం చూసుకోవడానికి వాచ్ కూడా లేదని పంచ్ వేశాడు. నాపైనే పంచ్ వేస్తావా..నా ఫ్యాన్స్ నీ సంగతి చూస్తారని సమంత అనగానే....భయపడిన అవినాష్ సమంత ఫ్యాన్స్ అసోసియేషన్ కి నేను ప్రెసిడెంట్ అని చెప్పి సమంతను కూల్ చేసే ప్రయత్నం చేశారు.