అక్కినేని సమంత నటించిన 'ఓ బేబీ' సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతోంది. సమంత వీలైనన్ని ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటుంది.

ఈ క్రమంలో సినిమా గురించి ఎన్నో విషయాలను షేర్ చేస్తోంది.. దర్శకురాలు నందిని రెడ్డి తనకు సోదరి లాంటిదని తనను ఎంతగానో నమ్ముతానని చెప్పింది. ఇప్పటివరకు తను పోషించిన పాత్రలలో 'ఓ బేబీ' రోల్ ది బెస్ట్ అని చెప్పింది. అంతేకాదు.. తనకు ఈ సినిమా ఎంతో ఛాలెంజింగ్ గా అనిపించిందని వెల్లడించింది.

రాజేంద్రప్రసాద్ నుండి కామెడీ టైమింగ్ నేర్చుకున్నానని, ఈ సినిమాకు అది ఎంతగానో ఉపయోగపడిందని చెప్పుకొచ్చింది. సినిమాలో నాగశౌర్య పాత్ర హైలైట్ ఉంటుందని.. ఆ రోల్ అంగీకరించిన శౌర్యకి కృతజ్ఞతలు చెప్పింది.

ఇక తన వ్యక్తి గత విషయాల గురించి మాట్లాడుతూ.. తన భర్త నాగచైతన్యపై ప్రశంసలు  కురిపించింది. చైతు మంచి భర్త అని.. ఓ మంచి తండ్రి కూడా అవుతాడనే నమ్మకం ఉందని తెలిపింది. 'ఏ మాయచేసావే' సినిమాకి ఇప్పటికీ చైతులో ఫోకస్ బాగా పెరిగిందని.. బాధ్యత కూడా పెరిగిందని చెప్పుకొచ్చింది.