తాజాగా అక్కినేని హీరోయిన్‌ సమంత సరికొత్త ఛాలెంజ్‌కి శ్రీకారం చుట్టింది. `గ్రో విత్‌ మి` పేరుతో మరో సవాల్‌కి తెరలేపింది. ఇందులో భాగంగా ఎవరికి వారే తమ ఆహారాన్ని పండించుకోవడం ఈ సవాల్‌ ఉద్దేశ్యమని తెలిపింది.

టాలీవుడ్‌ బ్యూటీ, స్టార్‌ హీరోయిన్‌ సమంత సరికొత్త ఛాలెంజ్‌కి తెరలేపింది. ప్రస్తుతం `గ్రీన్‌ ఇండియా`ఛాలెంజ్‌ నడుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటుతున్నారు. ఇందులో సినీ స్టార్స్ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కరోనా వల్ల అంతా ఇంట్లోనే ఉంటున్న నేపథ్యంలో గ్రీన్‌ ఛాలెంజ్‌ని సక్సెస్‌ చేశారు. 

ఇదిలా ఉంటే తాజాగా అక్కినేని హీరోయిన్‌ సమంత సరికొత్త ఛాలెంజ్‌కి శ్రీకారం చుట్టింది. `గ్రో విత్‌ మి` పేరుతో మరో సవాల్‌కి తెరలేపింది. ఇందులో భాగంగా ఎవరికి వారే తమ ఆహారాన్ని పండించుకోవడం ఈ సవాల్‌ ఉద్దేశ్యమని తెలిపింది.

సమంత చాలా రోజులుగా తమ ఇంట్లోనే ఓ గార్డెన్‌ ఏర్పాటు చేసుకుని కుండీలలో కూరగాయాలు పండిస్తున్నారు. ఆ విషయాలను చెబుతూ `గ్రో విత్‌ మి` ఛాలెంజ్‌ని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ని, మంచు లక్ష్మిని నామినేట్‌ చేశారు. ఈసందర్భంగా సమంతా మాట్లాడుతూ, `మరికొన్ని వారాల పాటు కలిసి పండించుకుందాం. చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుందాం. ఒక కుండీ, కొద్దిగా మట్టి, విత్తనాలు, ఖాళీ పాల ప్యాకెట్‌ ఉన్నాసరే, ఇప్పుడు పని మొదలు పెట్టండి, మంచు లక్ష్మీ,రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను నామినేట్‌ చేస్తున్నా` అని చెబుతూ ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది సమంత. 

దీనికి సోషల్‌ మీడియాలో విశేష స్పందన లభిస్తుంది. కేవల 24 గంటల్లో దాదాపు 16లక్షల మంది సమంత వీడియోని వీక్షించారు. అంతేకాదు ప్రతి ఒక్కరు సమంత ఆలోచన అద్భుతంగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు. మరి సమంత సవాల్‌ని రకుల్‌, మంచు లక్ష్మీ ఎప్పుడు స్వీకరిస్తారో, ఈ సవాల్‌ సక్సెస్‌ అవుతుందా? అన్నది చూడాలి.

View post on Instagram