సమంత ఫైనల్ గా ఎలక్షన్ ప్రచారాల్లో తన గళాన్ని విప్పింది. మన రేపెల్లె అభ్యర్థికి మీ అమూల్యమైన ఓటును వేసి బారి మెజారిటీతో గెలిపించండి అంటూ  సమంత చెబుతున్నట్లు ఉన్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

సమంత ఫైనల్ గా ఎలక్షన్ ప్రచారాల్లో తన గళాన్ని విప్పింది. మన రేపెల్లె అభ్యర్థికి మీ అమూల్యమైన ఓటును వేసి బారి మెజారిటీతో గెలిపించండి అంటూ సమంత చెబుతున్నట్లు ఉన్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుంటూరు జిల్లా రేపెల్లె అసెంబ్లీ స్థాన నుంచి సత్యప్రసాద్ టీడీపీ తరపున పోటీ చేయనున్నారు. 

ఇక సైకిల్ గుర్తుకే మీ ఓటు.. నా పూర్తీ మద్దతు సత్యప్రసాద్ గారికే అంటూ సమంత వీడియోలో వివరణ ఇవ్వడం కొందరిని షాక్ కి గురి చేస్తోంది. అయితే సత్యప్రసాద్ కు సమంత ఎలా పరిచయం అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమంత సోషల్ మీడియా ద్వారా మరో వివరణ ఇచ్చారు. 

ఆయన తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అంటూ.. వ్యక్తిగతంగా నా మద్దతు ఆయనకే.. వారి సోదరి డాక్టర్ మంజుల కూడా నాకు మంచి స్నేహితురాలిని తెలిపింది. అదే విధంగా ఆయన మంచి వ్యక్తి కాబట్టి సపోర్ట్ చేస్తున్నట్లు అక్కినేని కోడలు వివరణ ఇచ్చింది. 

Scroll to load tweet…

Scroll to load tweet…