చై సామ్ మళ్ళీ కలవబోతున్నారా.. ఇప్పుడిదే హాట్ టాపిక్. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీనికి కారణం లేకపోలేదు. సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుని నెలలు గడుస్తోంది.
చై సామ్ మళ్ళీ కలవబోతున్నారా.. ఇప్పుడిదే హాట్ టాపిక్. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీనికి కారణం లేకపోలేదు. సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుని నెలలు గడుస్తోంది. అందరిని షాక్ లో ముంచెత్తుతూ చై సామ్ విడిపోయారు. గత ఏడాది అక్టోబర్ లో ఈ క్రేజీ జంట విడిపోయిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం సమంత, నాగ చైతన్య ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ బిజీగా గడుపుతున్నారు. అయితే తాజాగా సమంత తన ఇంస్టాగ్రామ్ లో విడాకుల ప్రకటన పోస్ట్ ని తొలగించడం హాట్ టాపిక్ గా మారింది. దీనితో అభిమానుల్లో మళ్ళీ చర్చ మొదలైంది.
సమంత విడాకుల పోస్ట్ ఎందుకు డిలీట్ చేసింది? చై సామ్ మళ్ళీ కలవబోతున్నారా ? ఇలా అభిమానుల్లో అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. చైతు, సమంత మళ్ళీ కలిసిపోతే ఫ్యాన్స్ కు సంతోషమే. ఒక వేళ ఇద్దరికీ కలిసే ఉద్దేశమే ఉంటే సమంత తో పాటు చైతు కూడా విడాకుల పోస్ట్ డిలీట్ చేయాలి. కానీ చైతు మాత్రం డిలీట్ చేయలేదు.
ఇక ఆ పోస్ట్ అవసరం లేదు అని భావించి సమంత డిలీట్ చేసి ఉంటుందని అంటున్నారు. చై సామ్ 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నాలుగేళ్లపాటు వీరి వైవాహిక జీవితం కొనసాగింది. అనుకోకుండా వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో.. ఇకపై తమ దారులు వేరని.. తాము భార్య భర్తలుగా ఉండడం లేదని ప్రకటిస్తూ విడిపోయారు.
వీరిద్దరి ఊహించని నిర్ణయంతో ఇండస్ట్రీ, అభిమానులు షాక్ కి గురయ్యారు. ఆ తర్వాత సమంతపై అనేక ఆరోపణలు, ట్రోలింగ్ జరిగాయి. కానీ వాటన్నింటిని దిగమింగుతూ సామ్ ధీటుగా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది.
