దర్శకనిర్మాతలకు ఎంత చెప్పినా వినలేదు.. సమంత వివాదాస్పద వ్యాఖ్యలు!

First Published 3, Sep 2018, 3:51 PM IST
samantha controversial comments on u turn movie producers
Highlights

సమంత నటించిన 'యూటర్న్', నాగచైతన్య నటించిన 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమాలో ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. భార్యాభర్తలిద్దరూ ఒకేసారి థియేటర్లోకి వచ్చి పోటీ పడనున్నారని సోషల్ మీడియాలో చెయ్ వర్సెస్ సామ్ అంటూ హ్యాష్ ట్యాగ్ లు ఇస్తున్నారు.

సమంత నటించిన 'యూటర్న్', నాగచైతన్య నటించిన 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమాలో ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. భార్యాభర్తలిద్దరూ ఒకేసారి థియేటర్లోకి వచ్చి పోటీ పడనున్నారని సోషల్ మీడియాలో చెయ్ వర్సెస్ సామ్ అంటూ హ్యాష్ ట్యాగ్ లు ఇస్తున్నారు. తాజాగా ఈ విషయంపై సమంత చేసిన కామెంట్స్ వివాదస్పదంగా అనిపిస్తున్నాయి. 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాతో తన సినిమా పోటీ పడడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని సమంత తేల్చి చెప్పింది.

ఈ విషయంపై దర్శకనిర్మాతలకు ఎంతగా చెప్పినా.. వారు మాత్రం తన మాట పెద్దగా పట్టించుకోలేదనే షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. అంతేకాదు.. 'యూటర్న్' దర్శకనిర్మాతలు సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావాలని, అందరి దృష్టిని ఆకర్షించడానికి ఇలా చైతన్య సినిమాతో పోటీగా విడుదల చేస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ మధ్యకాలంలో వివాదాలను సృష్టించుకొని విడుదలైన చాలా సినిమాలు సక్సెస్ సాధించాయనే మాట వాస్తవం.

సమంత ఆ కోణంలోనే ఈ విధమైన కామెంట్స్ చేసిందని అంటున్నారు. ఇక ఈ రెండు సినిమాలు రెండు వేర్వేరు జోనర్లకు సంబంధించినవి. కాబట్టి రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటాయనే నమ్మకం తనకుందని సమంత చెప్పుకొచ్చింది. 

loader