టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత, నాగ చైతన్య ప్రస్తుతం మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. షూటింగ్స్, ఈవెంట్స్ తో బిజీగా ఉండే ఈ జంటకు కొంత విరామ సమయం దొరకడంతో జాలీగా మాల్దీవ్స్ కి చెక్కేశారు. అందమైన సాగర తీరంలో ఏకాంతంగా గడుపుతూ లైఫ్ ని ఆస్వాదిస్తున్నారు. తమ మాల్దీవ్స్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు. 

ఈ వెకేషన్ లో సమంత భర్త చైతన్యకు చిన్న ఝలక్ ఇచ్చింది. అందమైన బబుల్ బాత్ టబ్ లో తాను మాత్రమే స్నానం చేస్తూ, టీజింగ్ ఫోజులిచ్చింది. ఆ విషయాన్ని తన ఫ్రెండ్స్ కి తెలియజేసి ఎంజాయ్ చేసింది. విషయంలోకి వెళితే...సమంత ఫ్రెండ్ క్రెషా భర్త వన్రాజ్ ఝవేరి ఓ అందమైన బాత్ టబ్ డిజైన్ చేశారు.  అందంగా గులాబీ రేకులతో అలంకరించిన బబుల్ బాత్ టబ్ లో సమంత మరియు నాగ చైతన్య కలిసి స్నానం చేయడానికి ఆ టబ్ ఏర్పాటు చేశారట. 

కానీ ఆ బాత్ టబ్ లో సమంత ఏకాంతంగా స్నానం చేయడమే కాకుండా, సదరు పిక్స్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టి ఫ్రెండ్స్ క్రెషా మరియు వన్రాజ్ లను ట్యాగ్ చేసింది. దీనితో సమంత ఫ్రెండ్స్ షాకయ్యారట. అందమైన బాత్ టబ్ లో చైతూ తో కలిసి స్నానం చేయకుండా, ఒక్కతే ఎంజాయ్ చేసింది. 

ఇక సామ్-చైతూ వివాహం చేసుకొని దాదాపు నాలుగేళ్లు అవుతుంది. అయినా వీరు పిల్లల కనాలనే ఆలోచన చేయడం లేదు. ఇద్దరూ 30 ప్లస్ లోకి ఎంటర్ కాగా ఎప్పుడు పిల్లల్ని కంటారో చూడాలి. ఇద్దరూ ఎవరి కెరీర్ లో వారు బిజీగా గడుపుతున్నారు. చైతూ నటించిన లవ్ స్టోరీ షూటింగ్ పూర్తి చేసుకుంది. సమంత నటిగా మరియు హోస్ట్ గా కెరీర్ ని పరుగులు పెట్టిస్తున్నారు.