ఏం మాయ చేసావె సినిమా నుంచే నాగచైతన్యతో సమంత ప్రేమాయణం ఈ అక్టోబర్ 6న వివాహం చేసుకున్న సమంత, నాగచైతన్య సమంత అక్కినేని గా పేరు మార్చుకున్న సమంత రుత్ ప్రభు
అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్యను వివాహం చేసుకున్న సమంత తన సోషల్ మీడియా ఎకౌంట్స్ నుంచి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ తన లైఫ్ లో జరిగే హాపెనింగ్స్ అన్నీ.. తాను అప్ డేట్ చేస్తూ తన ఫాలోవర్స్ అందరితోనూ షేర్ చేసుకునేది. ట్విటర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సోషల్ ప్లాట్ ఫామ్స్ లో తన విడియోలు, ఫొటోలు, మంచి విశేషాలు అన్నీ పంచుకుంటుంది సామ్.
తాజాగా అక్టోబర్ 6న నాగచైతన్యను పెళ్లిచేసుకుంది సమంత. గోవాలో ఇటు హిందూ సంప్రదాయం, అటు క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగిన తర్వాత సమంత వివాహానంతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని కాస్త ఫ్రీ అయినట్లు కనిపిస్తోంది. తాజాగా రాజుగారి గది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సమంత. ఈ చిత్ర విశేశాలను మీడియాతో పంచుకుంది. ఇక త్వరలో హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే నాగార్జున కూడా 15న రిసెప్షన్ నిర్వహిస్తామని ప్రకటించారు కూడా.
మరోవైపు అక్కినేని వారింట కోడలుగా అడుగుపెట్టిన సమంత ఇప్పటి వరకు తన పేరు సమంత రుత్ ప్రభు అని చెప్పుకుంటు ఉండేది. అంతే కాక సోషల్ మీడియా ఎకౌంట్స్ లో కూడా... సమంత రుత్ ప్రభు అని పెట్టుకుంది. కానీ ఇప్పుడు సమంత తన పేరు మార్చేసింది. సమంత అక్కినేనిగా పేరు మార్చుకుని సోషల్ మీడియా సైట్స్ ట్విటర్, ఫెస్ బుక్ లలో “సమంత అక్కినేని” అని పేరు మార్చుకుంది. మొత్తానికి సమంత పెళ్లి తర్వాత చాలా హాపీగా వున్నట్లు కనిపిస్తోంది.
