తమ పేర్లు మార్చికోవటం సినిమా స్టార్స్ మామూలే. ముఖ్యంగా లక్ కలిసిరానప్పుడు, సినిమాలు ఫ్లాఫ్ అయ్యినప్పుడు ఆ పని చేస్తూంటారు. వాటిని అఫీషియల్ గా ప్రకటిస్తూంటారు.  వివాహం అయ్యాక..ఇంటిపేరు మారుతూంటుంది. అదే పద్దతిలోస‌మంత, నాగ‌చైత‌న్య‌ను పెళ్లి చేసుకోగానే సోష‌ల్ మీడియా ఎక్కట్స్ లలో పేరు మార్చేసింది. స‌మంత ప్ర‌భు కాస్త స‌మంత అక్కినేనిగా మారిపోయింది. కాగా ఇప్పుడు మ‌రోసారి స‌మంత త‌ను పేరును మార్చుకుంది. 

అప్పుడంటే వివాహం అయ్యింది..పేరు మార్చుకుంది. ఇప్పుడు ఇప్పుడు స‌మంత త‌న పేరుని మార్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే..అందుకు బ‌ల‌మైన కార‌ణం ఉంది. అది మరోదో కాదు సమంత తాజా చిత్రం.. `ఓ బేబీ` చిత్రం.  ఈ చిత్రం లో సమంత పేరు బేబి . అలాగే సినిమా పేరు కూడా ఓ బేబి. దాంతో సినిమా ప్రమోషన్ కు కలిసొస్తుందని సమంత తెలివిగా ఇలా సోషల్ మీడియాతో తన పేరు మార్చుకుందన్నమాట. 

ఇక ఇప్పటికే ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లై మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల కానుంది. “నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు ఒక్కొక్కరికి..  చూస్తారు గా”  అంటోంది సమంత . కొరియన్ మూవీ మిస్ గ్రానీ ఆధారంగా నందిని రెడ్డి సమంతతో రూపొందించిన చిత్రం ఓ బేబీ . నందిని రెడ్డి తెలుగు లో చేసిన మార్పులు, సమంత చేసిన నటన మాత్రమే  సినిమా కు హైలెట్ గా నిలిచేలా ఉన్నాయి.