అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 'నిన్నుకోరి' ఫేం దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఇందులో సమంత, చైతు భార్యాభర్తలుగా కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియో లీక్ అయింది. ఇందులో చైతు, సమంత ఓ ఇంట్లో కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ కనిపించారు. దీన్ని ఓ అభిమాని ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. సమంత, చైతులని ట్యాగ్ చేశాడు.

'ఈ వీడియో చూసిన తరువాత అధ్బుతమైన భావన కలిగింది. అందమైన జంట.. మీరు చైతన్యతో ఏదైనా టాప్ సీక్రెట్ మాట్లాడుతున్నారా.. సమంత. మజిలీ సినిమా విశేషాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం' అంటూ రాసుకొచ్చాడు.

దీన్ని చూసి షాక్ అయిన సమంత అతడి ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ.. షాకింగ్ ఎమోజీలను పోస్ట్ చేసింది. అయితే కొద్దిసేపటికే సామ్ ఈ ట్వీట్ ని తొలగించింది. ప్రస్తుతమైతే ఈ సినిమా మేకింగ్ వీడియో ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. ఇంకా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయనప్పటికీ.. మజిలీ అనే పేరుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.