వివాహం అనంతరం కూడా సినిమాలు చేస్తూ.. ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ నింపుతోంది అక్కినేని వారి కోడలు సమంత. ప్రస్థుతం సమంత రంగస్థలం షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్న సమంత స్కూటీపై షికార్లు చేసేస్తోంది. అయితే సరదా ఎంజాయ్‌ చేయడం కోసం కాదు. ఆమె నటిస్తున్న చిత్రంలోని ఓ సన్నివేశం కోసం. సమంత కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘యూ టర్న్‌’. కన్నడలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న ఈ సినిమాను తెలుగు, తమిళంలో రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల మొదలైంది.

 

ప్రస్తుతం రాజమహేంద్రవరంలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సమంత రాజమహేంద్రవరం రోడ్లపై స్కూటీ నడుపుతున్న సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సమంత కథానాయికగా నటించిన ‘రంగస్థలం’ చిత్రీకరణ కూడా రాజమహేంద్రవరం పరిసరాల్లోనే జరిగింది. ఇక్కడి వాతావరణం తనకు చాలా నచ్చిందని ఒకానొక సందర్భంలో సమంత వెల్లడించారు.

 

శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై ‘యూ టర్న్‌’ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సమంత నటించిన ‘రంగస్థలం’ చిత్రీకరణ ఇటీవల పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకొంటోంది. మరో పక్క ఆమె ‘మహానటి’ సినిమాతోనూ బిజీగా ఉన్నారు.