సమంత, విజయ్ దేవరకొండ కలిసి ప్రస్తుతం `ఖుషి` చిత్రంలో నటిస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉంటే విజయ్ బర్త్ డే సందర్భంగా సమంత ఓ పోస్ట్ పెట్టింది. అదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నేడు(మే 9)న తన 34వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానుల నుంచి విషెస్‌లు వెళ్లువలా వస్తున్నాయి. అందులో భాగంగా హీరోయిన్ సమంత కూడా విజయ్‌కి బర్త్ డే విషెస్ చెప్పింది. సోమవారం సాయంత్రమే ఆమె విజయ్ దేవరకొండ బర్త్ డే సీడీపీని విడుదల చేస్తూ విషెస్ పోస్ట్ పెట్టింది. ఇన్‌స్టా స్టోరీస్‌లో ఈ విషెస్ తెలియజేయడం విశేషం.
ఇదిలా ఉంటే ఇందులో సమంత పెట్టిన కామెంట్ ఇప్పుడు రచ్చ లేపుతుంది. ఈ సందర్భంగా సమంత చెబుతూ, నా మంచి స్నేహితుడు, నా ఫేవరేజ్ కోస్టార్ విజయ్ దేవరకొండ బర్త్ డే సీడీపీని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. నీ సక్సెస్ కోసం నేను ప్రార్థిస్తున్నా, విషెస్ తెలియజేస్తున్న. ఎందుకంటే నువ్వు నిజంగా అన్నింటిలో బెస్ట్ పొందేందుకు అర్హత కలిగి ఉన్నావు` అని పేర్కొంది సమంత. ఆమె చేసిన ఈ పోస్ట్ నెట్టిం చక్కర్లు కొడుతూ రచ్చ చేస్తుంది.
విజయ్ దేవరకొండతో గతంలో `మహానటి`లో కలిసి నటించింది సమంత. అందులో సెకండ్ లేయర్‌లో వీరిద్దరి లవ్ ట్రాక్ నడుస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు `ఖుషి` చిత్రంలో జంటగా నటిస్తున్నారు. రొమాంటిక్ కపుల్‌గా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమంత ఇప్పుడీ పోస్ట్ చేయడం హాట్ టాపిక్ అవుతుంది. అయితే ఇది పరోక్షంగా మాజీ భర్త నాగచైతన్యకి జెలసి పుట్టించేలా ఉందని అంటున్నారు నెటిజన్లు. చైతూతో సమంత నాలుగు సినిమాలు(ఏం మాయ చేసావె, మనం, ఆటోనగర్ సూర్య, మజిలి) చేసింది. బెస్ట్ పెయిర్‌గానూ నిలిచారు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ తన ఫేవరేట్ కోస్టార్ అంటూ సమంత పోస్ట్ చేయడం రచ్చ లేపుతుంది. నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది.

12ఏళ్ల క్రితం `నువ్విలా` చిత్రంతో నటుడిగా టాలీవుడ్‌కి పరిచయం అయిన విజయ్ దేవరకొండ.. `లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్`, `ఎవడే సుబ్రమణ్యం` చిత్రాల్లో నటించి మెప్పించాడు. `పెళ్లి చూపులు` చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో తొలి హిట్‌ని అందుకుని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. `అర్జున్‌రెడ్డి`తో మాస్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఆయన `గీతగోవిందం`తో స్టార్ హీరో అయిపోయారు. అదే క్రేజ్‌ని, ఇమేజ్ ఇప్పటికీ సస్టెయిన్ చేస్తున్నాడు. `నోటా`, `టాక్సీవాలా`, `డియర్ కామ్రేడ్`, `వరల్డ్ ఫేమస్ లవర్`, `లైగర్` చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్‌లను మూటగట్టుకున్నాడు. ఇప్పుడు `ఖుషి`తో సక్సెస్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు.
