సమంతకు చాదస్తం ఎక్కువైందా..?

First Published 13, Dec 2017, 12:36 PM IST
samantha become more concerned about film selection
Highlights
  • ఇటీవలే అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టిన సమంత
  • అక్కినేని నాగచైతన్యతో పెళ్లి తర్వాత తనలో మార్పేమీ రాలేదన్న సామ్
  • అయితే చిన్న ట్విస్ట్.. తనకు చాదస్తం ఇంకా ఎక్కువైందట

 

సినిమా కెరీర్ లో సూపర్ సక్సెస్ హిరోయిన్స్ లో సమంత ఒకరు. తన పర్సనల్ లైఫ్ లో కూడా.. లవ్ సక్సెస్ చేసుకుని..నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని వారింటి కోడలుగా అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత రిలీజైన తొలి చిత్రం రాజుగారి గది 2 సక్సెస్ తో నాగార్జున ఫ్యామిలీకి మెట్టినింటి సెంటిమెంట్ నిలబెట్టింది. అడుగుపెట్టిన వేళా విశేషం అంటారుగా.. అలా సక్సెస్ సాధించింది.

 

ప్రస్థుతం రామ్ చరణ్ రంగస్థలం చిత్రంలో, సావిత్రి జీవితంపై తెరకెక్కుతున్న మహానటిలో కీ రోల్ చేస్తోంది సమంత. తమిళంలో కూడా రెండు సినిమాలు చేస్తోంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ.. అటు పర్సనల్ లైఫ్ లో కూడా ఫ్రీడమ్ లో ఏ మాత్రం తేడా రరాకుండా హ్యాపీగా గడిపేస్తున్నానంటోంది. అయితే.. తనకు ఈ మధ్య చాదస్తం ఎక్కువైందంటోంది.

 

సహజంగానే పెళ్లయ్యాక అబ్బాయిల్లోగానీ, అమ్మాయిల్లో గానీ చాలా మార్పులొస్తుంటాయి.  సమంత కూడా మారింది. ‘వ్యక్తిగతంగా పెద్దగా ఏం మారలేదు. నా స్వేచ్ఛని కోల్పోయే పరిస్థితులు, నా అభిరుచుల్ని మార్చుకోవాల్సిన అవసరాలూ రాలేదని స్పష్టం చేస్తూనే... వృత్తిగతంగా మాత్రం మారాల్సి వచ్చిందని అంటోంది. కథల్ని ఎంచుకొనే విషయంలో ఇది వరకటి కంటే ఎక్కువ జాగ్రత్త పడుతున్నాను.

 

నిజానికి ముందు నుంచీ నాక్కొంచెం చాదస్తం ఎక్కువే. మంచి సినిమాలు చేతిలో ఉండడం వల్ల, కాస్త అటూ ఇటుగా ఉండే కథల్ని పక్కన పెట్టే అవకాశం వచ్చేది. ఓ సినిమాకి ‘నో’ చెప్పాలంటే కారణాలు వెదుక్కోవాలి కదా? అందుకే ‘ఇది నచ్చలేదు... అది నచ్చలేదు’ అంటూ పట్టుబట్టి తప్పుల్ని వెదికేదాన్ని. ఇప్పుడు అది మరింత ఎక్కువ అయ్యింది. అంటే చాదస్తం మరీ ఎక్కువైందన్నమాట. ఏం చేసినా కెరీర్‌ బాగుండాలనే కదా’’ అంటోంది సామ్.

loader