కొన్ని నెలల గ్యాప్‌ అనంతరం సమంత తిరిగి `ఖుషి` సెట్‌లో పాల్గొంది. విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ లో నేడు సామ్‌ పాల్గొంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె చేత  కేక్‌ కట్‌ చేయించి సెలబ్రేట్‌ చేశారు.

సమంత మయోసైటిస్‌ వ్యాధి నుంచి కోలుకుంది. ఫిట్‌గా తయారయ్యింది. జిమ్‌లో శ్రమించి పూర్వపు శక్తిని పొందింది. ఇక వరుసగా సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటూ దూసుకుపోతుంది. తాజాగా ఈ అమ్మడు `ఖుషి` సినిమా సెట్‌లో పాల్గొంది. ఈ సినిమా షూటింగ్‌ ఆగిపోయి చాలా రోజులవుతుంది. సమంత అనారోగ్యం నేపథ్యంలో వాయిదా వేసింది టీమ్‌, ఆమె కోలుకోవడానికి టైమ్‌ పట్టిన నేపథ్యంలో సమంత కోసం ఇన్నాళ్లు వెయిట్‌ చేశారు. 

కొన్ని నెలల అనంతరం సమంత ఎట్టకేలకు `ఖుషి` సినిమా సెట్‌లో పాల్గొంది. ఆమె ఉమెన్స్ డే సందర్భంగా నేడు బుధవారం(మార్చి8)న ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నట్టు ప్రకటించింది యూనిట్‌. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఆమెకి ఘన స్వాగతం పలికారు. అంతేకాదు సినిమా సెట్‌లో `ఉమెన్స్ డే` సెలబ్రేషన్స్ నిర్వహించారు. హీరో విజయ్‌ దేవరకొం సమక్షంలో ఉమెన్స్ డే సందర్భంగా సమంతకి, టీమ్‌లో పనిచేస్తున్న మహిళలకు విషెస్‌ చెబుతూ కేక్‌ కట్‌ చేశారు. సమంత చేత కేక్‌ కట్‌ చేయించడం విశేషం. అలాగే సమంత చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 13ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగానూ ఆమెకి విషెస్‌ తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సమంత, విజయ్‌ దేవరకొండతోపాటు దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాత రవి శంకర్‌, ఇతర టీమ్‌ సభ్యులు పాల్గొన్నారు. నేటి నుంచి ఈ చిత్ర షూటింగ్‌ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక దర్శకుడు శివ నిర్వాణ .. సమంతకి ట్విట్టర్‌ ద్వారా స్వాగతం పలికారు. `ఖుషి` సెట్‌లోకి ఫైటర్‌ సమంత తిరిగి జాయిన్‌ అయ్యారు. ప్రతి ఒక్కటి బ్యూటిఫుల్‌గా జరుగుతున్నాయి` అని పేర్కొన్నారు. 

Scroll to load tweet…

సమంత గతేడాది జూన్‌ నుంచి మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. దాదాపు మూడు నాలుగు నెలలు ఆమె అమెరికాలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకుంది. ఈ క్రమంలో అనేక స్ట్రగుల్స్ పడింది. `యశోద` ఇంటర్వ్యూలో తన పరిస్థితిని చెబుతూ కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్నట్టు చెప్పింది. అది అందరిని కదిలించింది. ఇక ఆ వ్యాధి నుంచి కోలుకుంటూ జిమ్‌లో శ్రమించింది. కోల్పోయిన ఫిట్‌నెస్‌ తిరిగి పొందింది. ఇటీవలే హిందీలో `సిటాడెల్‌` రీమేక్‌లో నటించింది. దాన్ని పూర్తి చేసుకుని, ఇప్పుడు `ఖుషి` సినిమా షూటింగ్‌లో పాల్గొనడం విశేషం. మరోవైపు సమంత నటించిన `శాకుంతలం` సినిమా ఏప్రిల్‌ లో విడుదల కాబోతుంది.