రాజుగారి గది2లో సమంత ఆత్మ పాత్ర నాగచైతన్యతో వివాహం తర్వాత రిలీజ్ అవుతున్న తొలి సినిమా ఈ చిత్రంలో సమంతను చూడలేక పోయానన్న నాగార్జున

సమంత వివాహం తర్వ త రిలీజ్ అవుతున్న ఫస్ట్ అండ్ లేటెస్ట్ మూవీ రాజుగారి గది2. ఈ చిత్రం అక్టోబర్ 13న రిలీజ్‌ అవుతుంది. రాజుగారి గది1 చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్నది. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున తొలిసారి ఓ హారర్, సస్సెన్స్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

ఈ చిత్రంలో సమంత నటిస్తున్న పాత్ర పేరు అమృత. ఆమె ఓ ఆత్మ పాత్రను పోషిస్తున్నారు. అయితే ఆత్మగా మారడానికి ముందు సమంత ఓ లాయర్. అయితే లాయర్‌ వృత్తిని నిర్వహించే సమంత పాత్ర ఎందుకు చనిపోయింది అనేది ఈ చిత్రంలో కీలక అంశం. ఈ చిత్రంలో సమంత పాత్ర ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసే విధంగా ఉంటుంది అని ప్రచారం జరుగుతున్నది. ఆ చిత్రంలో లాయర్ పాత్రకు సంబంధించిన సమంత ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

రాజుగారి గది2 చిత్రంలో సమంత పాత్రకు డబ్బింగ్ చెప్పిన చిన్మయి ఓ దశలో కంటతడి పెట్టుకుందట. సమంత పాత్ర నా హృదయాన్ని కదిలించిందని అని చిన్మయి ట్వీట్ చేసింది. అంతేకాకుండా సమంత ఆత్మతో చేసిన సీన్లు ఆకట్టుకునే విధంగా ఉంటాయని నాగార్జున కూడా ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పారు. సమంతను దెయ్యం పాత్రలో చూడలేకపోయానని అన్నారు. తెర మీద సమంతను చూడటం చాలా ఇబ్బందిగా అనిపించింది. చైతూ అసలు రాజుగారి గది చిత్రాన్ని చూడను అని తనతో చెప్పాడు అని నాగార్జున వెల్లడించారు.

రాజుగారి గది2 చిత్రంలో నాగార్జున మెంటలిస్టుగా నటిస్తున్నారు. ఎదుటి వ్యక్తులను చూసి వారి మనసులోని విషయాలను పసిగట్టే పాత్రను నాగ్ పోషించారు. ఈ పాత్ర కోసం నాగార్జున పలువురు మెంటలిస్టులను, కొన్ని పరిశోధనలను కూడా చేశారు.

ఇక రాజుగారి గది2 చిత్రం మలయాళంలో వచ్చిన చిత్రానికి ఆధారం. ఈ చిత్రంలో నాగార్జున, సమంతతోపాటు వెన్నెల కిషోర్, సీరత్ కపూర్, అశ్విన్ బాబు నటించారు. అయితే ఈ మూవీలో టాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ కాజల్ అగర్వాల్ అతిథి పాత్రలో నటించిందనే ప్రచారం జరుగుతోంది.