'మహానటి'పై సమంతా అలిగిందా?

samantha angry on mahanti
Highlights

'మహానటి' సినిమాపై రిలీజ్ వరకు ఎలాంటి అంచనాలు లేవు.. ఇదేదో డాక్యుమెంటరీలా

'మహానటి' సినిమాపై రిలీజ్ వరకు ఎలాంటి అంచనాలు లేవు.. ఇదేదో డాక్యుమెంటరీలా ఉందనే కామెంట్లు వినిపించాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యి అందరి అనుమానాలను పటాపంచలు చేసింది. తెరపై ప్రతి ఒక్కరి కష్టం కనిపించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా మహానటిపై ప్రశంసల జల్లు కురిపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కీర్తి సురేష్ నటన గురించే మాట్లాడుకుంటున్నారు. సావిత్రి ఆమెకు పూనిందా..?  అంత అద్భుతంగా నటించిందంటూ ప్రేక్షకులు కీర్తిని కీర్తించడం మొదలుపెట్టారు. 

దర్శకనిర్మాతలు కూడా ఆమె మీద దృష్టి పెట్టడంతో ఈ విషయం సమంతను బాధ పెడుతుందని సమాచారం. రిలీజ్ కు ముందు సమంతా చేసిన మధురవాణి పాత్రను హైలైట్ చేస్తూ ప్రచారాలు బాగానే చేశారు. నిజానికి సినిమాలో సమంతా కూడా చక్కగా నటించింది. క్లైమాక్స్ ఆమె నటన కారణంగానే నిలబడింది. అలాంటిది క్రెడిట్ మొత్తం కీర్తికి వెళ్లిపోవడం.. సమంతా గురించి పెద్దగా చర్చించికపోవడంతో యూనిట్ పై సమంతా అలిగినట్లు సమాచారం.

కొద్దిరోజులుగా ఆమె 'మహానటి' టీమ్ కు దూరంగా ఉంటుందని తెలుస్తోంది. సమంతాతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేయాలని ప్లాన్ చేసిన యూనిట్ కు అసలు టచ్ లోకి రావడం లేదంట సమంతా.. 'రంగస్థలం' సినిమా రిలీజ్ తరువాత కోసం ప్రమోషన్స్ లో పాల్గొని యూనిట్ కు తనవంతు సహకారం అందించింది సమంతా.. కానీ మహానటి విషయంలో మాత్రం అలా జరగడం లేదు. అయినప్పటికీ సినిమాకు యునానిమస్ గా హిట్ టాక్ రావడంతో ప్రమోషన్స్ అవసరం లేకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.  

loader