ఇటీవలే అక్కినేని సమంత అని పేరు మార్చుకున్న సమంత గతంలో పెళ్లి కాక ముందు సమంత రుత్ ప్రభు అని సోషల్ మీడియా ఎకౌంట్స్ అక్కినేని కుటుంబ సభ్యురాలిగా తాత అక్కినేని కితాబును గుర్తు చేసుకున్న సమంత మహానటిలో కీలక పాత్రలో నటిస్తున్నా.. సావిత్రి పాత్ర చేయకపోవడం వెలితిగా ఫీలవుతున్న సమంత

అక్కినేని వారి కోడలు సమంత ప్రస్థుతం నటిస్తున్న సినిమాల్లో మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మహానటి ఒకటి. ఈ చిత్రంలో సమంత మహానటి పాత్రలో నటించకున్నా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. నాగ చైతన్యతో వివాహం తరువాత.. "రాజు గారి గది 2"లో మామతో కలసి పోటీ పడి నటించి విజయం సాధించడంతో హీరోయిన్ సమంత చాలా సంతోషంగా ఉన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్‌ లు పెడుతోంది. అయితే అదే సమంత ఇఫ్పుడు చాలా బాధపడుతోందట.

అక్కినేని నాగేశ్వరరావు గారు మొట్టమొదటిసారి తనకిచ్చిన కితాబును నిజం చేయలేక పోతున్నందుకు సమంత ఫీలవుతోందట. ఈ విషయం తాజాగా సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతోంది. అక్కినేని ఇంటి కోడలిగా తన బాధ్యతను నూరు పాళ్ళు నిర్వహిస్తానని చెబుతున్న సమంత అక్కినేని... తన మొదటి సినిమా "ఏ మాయ చేసావె" చూసిన తమ తాత అక్కినేని నాగేశ్వరరావుగారు తన నటనకు, చైతూ నటనకు మార్కులు ఇచ్చారని, అందులో 2 మార్కులు తనకే ఎక్కువ వచ్చాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది సమంత.

అంతేకాదు 2 మార్కులు ఎక్కువ ఇవ్వడమే కాకుండా తనని "మహానటి సావిత్రి" గారితో సరి పోల్చారని, నా కళ్లు కూడా ఆ మహానటి కళ్ళవలే వలే అద్భుత హవభావాలను పలికిస్తాయనే గొప్ప కాంప్లిమెంట్‌ని ఆయన నుండి అందుకున్నానని తెలి పింది. జగ్ద్విఖ్యాత నటులైన నాగేశ్వరరావుగారి నుండి ఇంత గొప్ప కాంప్లిమెంట్‌ అందుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపిన సమంత అక్కినేని, జీవితంలో ఆ కాంప్లిమెంట్స్ ను మరిచిపోలేనని, ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని తెలిపింది.

మరి అంత గొప్ప నటుడి నుంచి అచ్చం సావిత్రిలానే ఉన్నావని అనిపించుకున్న సమంత, ప్రస్తుతం చేస్తోన్న "మహానటి" చిత్రంలో మాత్రం సావిత్రిగా నటించే అవకాశం మాత్రం దక్కించు కోలేకపోయినందుకు చాలా ఫీలైంది. ఆ పాత్రను టాలీవుడ్‌లో రెండు మూడు సినిమాలు మాత్రమే చేసిన కీర్తి సురేష్ చేస్తున్న విషయం తెలిసిందే. సావిత్రి పాత్రని తను చేయలేకపోతున్నానే అనే విషయంలోనే మాత్రం సమంత ఫీల్ అవుతున్నట్లుగా అనిపిస్తోంది.