టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం హెల్త్‌ మీద దృష్టిపెట్టింది. లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్‌లకు బ్రేక్‌ పడటంతో ప్రస్తుతం ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ కొత్త విషయాలు నేర్చుకునే పనిలో ఉంది. యాక్టింగ్ నేర్చుకోవటంతో పాటు యోగా ట్రైనింగ్‌ కూడా తీసుకుంటుంది. లాక్‌ డౌన్‌ సమయంలో తన యాక్టివిటీని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటున్న ఈ బ్యూటీ తాజాగా హాట్ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో షేర్ చేసింది.

యోగా, థ్యానాన్ని తమ జీవితాల్లో అందంగా స్వాగతించిన వ్యక్తులు అంటూ సమంత సహా మరికొంత మందిని ట్యాగ్ చేసింది శిల్పా రెడ్డి. ఇషా ఫౌండేషన్‌ ప్రారంభించిన ఈ చాలెంజ్‌ను సమంత కంటిన్యూ చేస్తోంది. తన నడుము కనిపించేలా హాట్‌ ఫోటోను షేర్ చేసిన సమంత  `చాలెంజ్‌ను స్వీకరించాను.. శిల్పా రెడ్డి. డిఫరెంట్ సైడ్స్‌, డిఫరెంట్‌ షేడ్స్‌, డిఫరెంట్‌ ఎమోషన్స్‌, డిఫరెంట్ ఫీలింగ్స్‌ కానీ అన్ని ఒకటే అంటూ కామెంట్ చేసింది.

ఈ ఏడాది మొదట్లో జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు సమంత తరువాత తమిళ్‌లో ఒక్క సినిమా మాత్రమే అంగీకరించింది. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో కతువాకుల రెండు కాదల్‌ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పింది సమంత. అంతేకాదు తొలిసారిగా వెబ్‌ సిరీస్‌లో నటించిన ఈ బ్యూటీ అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్న ది ఫ్యామిలీ మేన్‌ 2 సిరీస్‌ లో నెగెటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనుంది.