స్టార్ హీరోయిన్ సమంత తన నటనతో టాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. సమంత ఈ ఏడాది నటించిన లేడి ఓరియెంటెడ్ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సమంత నటనకు తగ్గట్లుగా అద్భుతమైన పాత్రలు ఆమెని వరిస్తున్నాయి. 

సమంత తాజాగా మంచు లక్ష్మీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఈ ప్రోగ్రాంలో సమంత అనేక విషయాలని పంచుకుంది. సమంత జూనియర్ ఎన్టీఆర్ తో కలసి నాలుగు చిత్రాల్లో నటించింది. వీరిద్దరి కాంబోలో బృందావనం, రభస, రమయ్యావస్తావయ్యా, జనతా గ్యారేజ్ లాంటి చిత్రాలు వచ్చాయి. 

సమంత ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తన దృష్టిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బెస్ట్ డాన్సర్ అని కితాబిచ్చింది. ఎన్టీఆర్ తో కలసి పలు చిత్రాల్లో నటించా. అతడితో డాన్స్ చేయడం చాలా కష్టం అని సమంత పేర్కొంది. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ ని నేను గమనించేదాన్ని. సింగిల్ టేక్ లో ఎన్టీఆర్ డాన్స్ మూమెంట్స్ ఓకే అయిపోతాయి అని సమంత పేర్కొంది. 

ప్రస్తుతం సమంత శర్వానంద్ సరసన 96 రీమేక్ లో నటిస్తోంది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత.