ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో నటిగా సమంతకు అద్భుతమైన ప్రతిభ ఉంది. ఎలాంటి పాత్రలో అయినా 100 శాతం న్యాయం చేయగలదు. సమంత నటించిన లేటెస్ట్ మూవీ ఓ బేబీ శుక్రవారం విడుదలై థియేటర్స్ లో సందడి చేస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఓ బేబీ చిత్రానికి తొలి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ మొదలయింది. 

ఓ బేబీ చిత్రం కోసం సమంత తీరికలేకుండదా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఓ ఇంటర్వ్యూలో సమంత తన డ్రీమ్ డైరెక్టర్స్ గురించి వెల్లడించింది. నటీనటులు ప్రతి ఒక్కరికి తమ డ్రీమ్ డైరెక్టర్స్ దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలనే కోరిక ఉంటుంది. అలా సమంత జాబితాలో ఇద్దరు దర్శకులు ఉన్నారు. 

లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలని ఉన్నట్లు సమంత తెలిపింది. ఇక టాలీవుడ్ దర్శకులలో శేఖర్ కమ్ముల పేరు చెప్పింది. మణిరత్నం దర్శకత్వంలో నటించాలని స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం కోరుకుంటారు. ఆయన సినిమాలని ప్రజెంట్ చేసే విధానం అలా ఉంటుంది. 

ఇక నేచురల్ ఎమోషన్స్ తో సింపుల్ గా సినిమాలు తీసే శేఖర్ కమ్ముల కూడా తన ఫెవరెట్ డైరెక్టర్ అని సామ్ అంటోంది. దర్శక ధీరుడు రాజమౌళి పేరు మాత్రం సామ్ ప్రస్తావించలేదు. సమంత రాజమౌళి దర్శకత్వంలో ఆల్రెడీ ఈగ చిత్రంలో నటించేసింది. బహుశా రాజమౌళి పేర చెప్పకపోవడానికి ఇదే కారణం కావచ్చు.