సమంత నటిస్తున్న తాజా చిత్రం 'ఓ బేబీ'.  నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకురాలు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. సీనియర్ నటి లక్ష్మి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. సమంత పాత్రని నందిని రెడ్డి చాలా వినోదాత్మకంగా మలచినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఓ బేబీ చిత్రాన్ని జులై 5న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. 

ఇప్పటికే ఓ బేబీ చిత్ర ప్రచార కార్యక్రమాలు షురూ అయ్యాయి. నితిన్, సమంత జంటగా నటించిన అ.. ఆ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా మూడేళ్లు. ఈ సందర్భంగా సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ చిత్రంలో సమంత అనసూయ పాత్రలో నటించింది. అ.. చిత్రంలో సమంత నటనకు ప్రశంసలు దక్కాయి. 'అనసూయకు మూడేళ్లు.. అ.. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓ బేబీ చిత్రంలో కామెడీ పాత్రలో నటిస్తున్నా. బేబీ పాత్ర అనసూయ కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది అని సమంత పేర్కొంది. 

అ.. ఆ.. చిత్రానికి గాను సమంత ఫిలిం ఫేర్ అవార్డు సొంతం చేసుకుంది. ఫోటో స్టూడియోలోకి వెళ్లిన ఓ వృద్ధురాలు యువతిగా మరి వచ్చే ఆసక్తికర అంశంతో ఓ బేబీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.