ఓ బేబీ సినిమాతో సమంత ఎంతవరకు హిట్ అందుకుంటుందో గాని సినిమా కోసం ప్రమోషన్స్ మాత్రం హై రేంజ్ లో చేస్తోంది. ఇటీవల సమంత ఒకేరోజులో పదికి పైగా ఇంటర్వ్యూలు ఇచ్చి రెస్ట్ లేకుండా కష్టపడిందట. కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఓ బేబీ సినిమా జులై 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

ఆలా మొదలైంది ఫెమ్ నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగ శౌర్య - రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక శనివారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో సినిమా వేడుకకు వేదిక కానుంది. 

అయితే సినిమా అవుట్ ఫుట్ ని ఇదివరకే పదిసార్లకు పైగా పరీక్షించిన సమంత చాలా ఎగ్జయిట్ అవుతోందట. అంటే సినిమాపై నమ్మకం స్ట్రాంగ్ గా ఉన్నట్లు చెబుతోంది. అందుకే ప్రమోషన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గేది లేదని రెస్ట్ లేకుండా కష్టపడుతోంది. తప్పకుండా సినిమా ఆడియెన్స్ కి నచ్చుతుందని వారి రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. మరి ఈ సినిమాతో సమంత ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో చూడాలి.