పవన్ కళ్యాణ్ మూవీలో సల్మాన్ గెస్ట్ రోల్ చేస్తున్నారన్న వార్త టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. ఈ క్రేజీ కాంబో వెండితెరపై కలిసి కనిపించడం ఖాయమే అంటున్నారు. దీని కోసమే దర్శకుడు హరీష్ సల్మాన్ కి కలిసినట్లు విశ్వసనీయ సమాచారం.


మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)గాడ్ ఫాదర్ చిత్రంలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. మలయాళ హిట్ లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ చిత్రీకరణ జరుపుకుంటుంది. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ కీలక రోల్ కోసం చిరంజీవి సల్మాన్ ని సంప్రదించారు. చిరంజీవి స్వయంగా కలిసి రిక్వెస్ట్ చేయడంతో సల్మాన్ ఈ మూవీలో నటించడానికి ఒప్పుకున్నారు. సల్మాన్ ఖాన్ పై ఓ ఫైట్, ఓ సాంగ్ చిత్రీకరించినట్లు సమాచారం ఉంది. గాడ్ ఫాదర్ మూవీలో సల్మాన్ సందడి చేయడం అధికారికమే. కాగా చిరంజీవి బ్రదర్ పవన్ కళ్యాణ్ మూవీలో కూడా సల్మాన్ నటిస్తున్నారనేది లేటెస్ట్ బజ్. 

ప్రస్తుతం పవన్ (Pawan Kalyan)హరి హర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటున్నారు. నెక్స్ట్ ఆయన హరీష్ శంకర్ తో ప్రకటించిన భవదీయుడు భగత్ సింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లాల్సిన భవదీయుడు భగత్ సింగ్ కొన్ని కారణాల వలన ఆలస్యం అవుతుంది. కాగా ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ సల్మాన్ ఖాన్ (Salman Khan)ని కలిశారు. దీంతో హరీష్ ఆయనతో మూవీ చేయడానికి కలిశారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. 

అయితే అసలు కారణం అది కాదట. భవదీయుడు భగత్ సింగ్ (Bhavadeeyudu Bhagath singh) మూవీలో ఓ కీలక రోల్ చేయాల్సిందిగా సల్మాన్ ని రిక్వెస్ట్ చేశారట. సల్మాన్ సైతం సానుకూలంగా స్పందించారట. కాబట్టి భవదీయుడు భగత్ సింగ్ మూవీలో సల్మాన్ కనిపిస్తారని అంటున్నారు. పవన్-సల్మాన్ వెండితెరపై కనిపించడం ఫ్యాన్స్ కి భారీ ట్రీట్ అని చెప్పాలి. మరి ఇదే నిజమైతే ఓ గొప్ప కాంబినేషన్ సెట్ అయినట్లే. 

ఇక పవన్-హరీష్ శంకర్ ల బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ సల్మాన్ హిట్ మూవీ దబంగ్ రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఒరిజినల్ వర్షన్ కి చాలా మార్పులు చేసి స్ట్రెయిట్ మూవీ అనిపించేలా హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ తెరకెక్కించారు. వరుస పరాజయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ భారీ కమ్ బ్యాక్ ఇచ్చింది. మరోవైపు భవదీయుడు భగత్ సింగ్ మరింత ఆలస్యం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ తమిళ రీమేక్ వినోదయ సిత్తం ముందుగా పూర్తి చేయాలనే ఆలోచన చేస్తున్నారట.