డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓటీటీ కంటెంట్ లో వల్గారిటీని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. ఇంకా సల్మాన్ ఏమన్నాంటే..? 

బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే వెంటనే సల్మాన్ ఖాన్ గుర్తుకు వస్తాడు. ఆయనకు బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న కండల వీరుడు రీసెంట్ గా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం సల్మాన్ ఖాన్ ఓటీటీ కంటెంట్ మీద కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కంటెంట్ విషయంలో ఓటీటికి సెన్సార్ ఉండాలి అన్నారు. 

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ దూసుకుపోతున్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్ ల తో ఇంట్లో ఉన్న ఆడియన్స్ ను ఆకర్షిస్తున్నాయి. థియేటర్లకు వెళ్ళడానికి ఇష్షపడని ప్రేక్షకులకు ఇంట్లోనే ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. దాంతో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ప్రభావం బాగా పెరిగిపోయింది. ప్రేక్షకులు తమకు నచ్చిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ఇంటి దగ్గరే చూస్తున్నారు. థియేటర్ లకు వచ్చిన కొన్నిరోజులకే ఓటీటీల్లో సినిమాలు వస్తుండటంతో.. వాటివైపు బాగా ఆకర్షితులవుతున్నారు. వీక్షిస్తున్నారు.అయితే ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ అయ్యే కంటెంట్‌పై సెన్సార్‌షిప్‌ లేకపోవడం సమస్యగా మారింది. 

ఓటీటీల్లో వచ్చే కంటెంట్ లో కొన్ని మంచి కంటెంట్లు ఉంటుంటే..మరికొన్ని వల్గర్ గా ఉంటున్నాయి. హింస, మితిమీరిన శృంగారం డిజిటల్ కంటెంట్ లో ఎక్కువైపోతుంది. దాంతో వీటిక కట్టడికి చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తుంది. దీని వల్ల పిల్లలు చెడుదారులు పడుతన్నారంటూ తల్లి తండ్రులు కూడా ఆంధోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో తన సపోర్ట్ ను ప్రకటించారు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. ఓటీటీ కంటెంట్‌పై తప్పకుండా సెన్సార్‌షిప్‌ ఉండాలి. అప్పుడే శృంగార, అశ్లీల, హింసాత్మక దృశ్యాల్ని అడ్డుకోగలం అన్నారు.

పదిహేనేళ్ల వయసున్న మన పిల్లలు మొబైల్‌ ఫోన్లలో చూసే కంటెంట్‌ ఏమిటో మనకు తెలియకపోతే ఎలా? మితిమీరిన రొమాంటిక్‌ దృశ్యాలు అందుబాటులో ఉండటం పిల్లలకు ఏమాత్రం మంచిది కాదు. ఓటీటీ మీద తప్పకుండా సెన్సార్‌షిప్‌ ఉండాల్సిందే’ అని సల్మాన్ అన్నారు. ప్రస్తుతం చాలా మంది దర్శకనిర్మాతలు క్లీన్‌ కంటెంట్‌ మీదనే దృష్టి పెడుతున్నారని, అలాంటి కథలే ఎక్కువ మందికి చేరువవుతున్నాయని సల్మాన్‌ఖాన్‌ అభిప్రాయపడ్డారు. 

సల్మాన్ ఖాన్ తాజాగా నటించిన కీసీ కా భాయ్‌ కీసీ కి జాన్‌ సినిమా ఈ నెల 21న ప్రపంచ వ్యాన్తంగా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈమూవీలో సల్మాన్ జోడీగా పూజా హెగ్డే నటించగా.. టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేశారు. ఓ సాంగ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించగా.. ఈసినిమాపై దేశవ్యాప్తంగా మంచి అంచనాలు ఉన్నాయి. విడుదలకానుంది.