Salman Khan New Movie : 3 పాత్రలు.. 10 మంది హీరోయిన్లు.. రచ్చ చేయబోతున్న సల్మాన్ ఖాన్

బాలీవుడ్ లో రొమాంటిక్ హీరో.. కండల వీరుడు లాంటి పేర్లు సల్మాన్ ఖాన్(Salman Khan) కు మాత్రమే సొంత. ఆయన సినిమాలు.. ఆటిట్యూడ్ కూడా అలానే ఉంటుంది. త్వరలో ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు సల్లూ భాయ్..

Salman Khan Triple Role With 10 Heroines in New Movie

బాలీవుడ్ లో రొమాంటిక్ హీరో.. కండల వీరుడు లాంటి పేర్లు సల్మాన్ ఖాన్(Salman Khan) కు మాత్రమే సొంత. ఆయన సినిమాలు.. ఆటిట్యూడ్ కూడా అలానే ఉంటుంది. త్వరలో ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు సల్లూ భాయ్..

బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan). ఏజ్ పెరుగుతున్నా కొద్ది ఆయన క్రేజ్ పెరుగుతూనే ఉంది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న సల్మాన్ ఖాన్.. తన పాత సినిమాలకు కూడా సీక్వెల్స్ చేసుకుంటూ పోతున్నాడు. రీసెంట్ గా జరిగిన ఆయన బర్త్ డే వేడుకల్లో సల్మాన్ ఖాన్ తన సినిమాలు కొన్ని అనౌన్స్ చేశారు. తాను ఏం చేయబోతన్నాడో ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చారు.

బజరంగీ బాయిజాన్ సినిమాకు సీక్వెల్ తో పాటు నో ఎంట్రీ మూవీ సీక్వెల్ చేయబోతున్నట్టు సల్మాన్ చెప్పారు. సూపర్ సక్సెస్ సాధించిన ఈరెండు సినిమాల నుంచి సీక్వెల్స్ ఫ్యాన్స్ ను అలరించబోతున్నాయి. అయితే ముఖ్యంగా ఇప్పుడు అందరి దృష్టి సల్మాన్(Salman Khan)  నో ఎంట్రీ సీక్వెల్ మీదనే ఉంది. 2005 లో వచ్చిన నో ఎంట్రీ మూవీ మంచి సక్సెస్ సాధించింది. అనిల్ కపూర్(Anil Kapoor) , ఫర్ధిన్ ఖాన్ తో పాటు సల్మాన్ ఈ మూవీలో స్క్రీన్ శేర్ చేసుకున్నారు. ఈ మూవీని అనిస్ బజ్మీ డైరెక్ట్ చేశారు.

ప్రస్తుతం నో ఎంట్రీ  సీక్వెల్ మూవీని కూడా అనిస్ బజ్మీనే డైరెక్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ మూవీ కాంబినేషన్ లోనే ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో షాకింగ్ న్యూస్ ఏంటీ అంటే... సల్మాన్ ఖాన్(Salman Khan) ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ చేయబోతున్నారట. అంతే కాదు... ఈసినిమా కోసం ఏకంగా 10 మంది హీరోయిన్లను తీసుకోబోతున్నారట. అది కూడా బాగా పాపులర్ హీరోయిన్లను తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Also Read :Rashmika Mandanna : హిట్టు పడిందో లేదో.. అప్పుడే రేటు పెంచేసిన రష్మిక.. ఎంత తీసుకుంటుందో తెలుసా..?

ఈ సినిమా కోసం బాగా కష్టపడాలి సల్మాన్ ఖాన్(Salman Khan). అంతే కాదు 3 పాత్రల్లో నటిస్తుండటంతో డేట్స్ కూడా ఎక్కువగా కేటాయించాల్సి వస్తుందట. అందుకే ఇప్పుడు చేస్తున్న కబీ ఈద్ కబీ దివాళి సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత నో ఎంట్రీ షూటింగ్ ను వెంటనే స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ టైగర్ 3 మూవీ కూడా చేస్తున్నారు. ఈసినిమా షూటింగ్ డిల్లీలో జరగాల్సి ఉండగా.. కరోనా వల్ల పోస్ట్ పోన్ అయ్యింది. ఈ గ్యాప్ లో సల్మాన్ ఖాన్ టాలీవుడ్ లో కూడా ఓ సినిమాలో నటించాల్సి  ఉంది. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న గాడ్ ఫాదర్ మూవీలో ఆయన గెస్ట్ రోల్ చేయబోతున్నారు.

Also Read : Disha Patani Bikini:బికినీలో బోల్డ్‌గా...కుర్రాళ్ళు ఈ పిక్స్ చూసి బూతు కామెంట్స్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios