Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్: సల్మాన్ కు ఎంత ఇస్తున్నారో తెలిస్తే మైండ్ బ్లాంక్!

బాలీవుడ్లో బిగ్ బాస్ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అక్క‌డ స‌ల్మాన్ ఖాన్ పుణ్య‌మా అని షో ఇంటింటా అందరూ కళ్లార్పకుండా చూసే షోగా మారిపోయింంది. వారానికి రెండు సార్లు వ‌చ్చి సల్మాన్ ప‌ల‌క‌రిస్తే రేటింగ్స్ అదిరిపోతుంటాయి. ఒక‌టి రెండు కాదు.. ఇప్ప‌టికే 13 సీజ‌న్స్ పూర్తి చేసుకుని 14వ సీజ‌న్‌ లోకి వచ్చేసింది. 

Salman Khan to Charge Rs 16 Cr per Episode for Bigg Boss 14
Author
Hyderabad, First Published Aug 11, 2020, 7:48 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సల్మాన్ వంటి స్టార్ చేసిన షో చూడటానికి జనం ఎంతలా ఎగబడతారో, టీఆర్పీలు ఎంతలా ఉంటాయో టీవీ ఛానెల్స్ వారికి బాగా తెలుసు. అందుకే ఎంత ఖర్చైనా సరే అన్నట్లుగా తమ షోలోకి ఆయన్ను తీసుకురావటానికి ప్రయత్నిస్తూంటారు. అదే సమయంలో బాలీవుడ్లో బిగ్ బాస్ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అక్క‌డ స‌ల్మాన్ ఖాన్ పుణ్య‌మా అని షో ఇంటింటా అందరూ కళ్లార్పకుండా చూసే షోగా మారిపోయింంది. వారానికి రెండు సార్లు వ‌చ్చి సల్మాన్ ప‌ల‌క‌రిస్తే రేటింగ్స్ అదిరిపోతుంటాయి. ఒక‌టి రెండు కాదు.. ఇప్ప‌టికే 13 సీజ‌న్స్ పూర్తి చేసుకుని 14వ సీజ‌న్‌ లోకి వచ్చేసింది. 

ఈ నేపధ్యంలో సల్మాన్ ఖాన్ కు ఈ షో నిమిత్తం ఎంత రెమ్యునేషన్ ఇవ్వబోతున్నారు అనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ క్రేజ్ గురించి తెలిసిన సల్మాన్ తక్కువ తీసుకుంటాడా... ఒక్క షో కోసం ఆస్తులు రాయించుకునే పోగ్రాం పెట్టుకుంటున్నాడు స‌ల్మాన్ ఖాన్. ఈ షో కోసం స‌ల్మాన్ ఖాన్ తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఇంతకీ సల్మాన్ ఎంత తీసుకుంటున్నాడు అంటే...అక్షరాలా ఒక్కో ఎపిసోడ్ కు 16 కోట్లు. ఇది సౌత్ స్టార్స్ ఒక సినిమాకు తీసుకునే మొత్తంతో సమానం! 

అయితే అదేమీ పెద్ద మొత్తంగా లెక్కవేయటం లేదు టీవీ యాజమాన్యం.  సల్మాన్ ఖాన్ వంటి సూపర్ స్టార్ హోస్ట్ గా ఉన్నాడంటే ఆ కార్యక్రమం రేంజ్ ఎక్కడికి వెళుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే టీఆర్పీ పరంగా హిందీ బిగ్ బాస్ షో అనేక రికార్డులు సొంతం చేసుకోవడంలో సల్మాన్ పాత్ర కూడా ఉంది.  త్వరలోనే 14వ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో సల్మాన్ ఖాన్ పై ప్రోమో షూట్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios