బాలీవుడ్ లో అర్జున్ కపూర్, మలైకా అరోరాల లవ్ ఎఫైర్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపట్ల స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మొదట అర్జున్ కపూర్.. సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్ తో డేటింగ్ చేసేవాడట. ఆ సమయంలోనే ఆమె ఇంటికి వెళ్లి మలైకాతో పరిచయం పెంచుకున్నాడట. 

అప్పటికే మలైకాకి సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ తో పెళ్లైంది. అయినప్పటికీ ఆమె అర్జున్ కపూర్ తో ఎఫైర్ సాగించింది. ఆ కారణంగానే భర్త అర్భాజ్ కి విడాకులు కూడా ఇచ్చిందని అంటారు. ఈ విషయంలో సల్మాన్ కల్పించుకొని అర్భాజ్ తో మలైకాని కలిపే ప్రయత్నం చేశాడట. కానీ దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో సల్మాన్ ఏం చేయలేని పరిస్థితి.

దీనంతటికీ కారణమైన అర్జున్ కపూర్ పై సల్మాన్ ఖాన్ కి విపరీతమైన కోపంతో ఉన్నట్లు సమాచారం. ఈ కోపాన్ని పరోక్షంగా చూపిస్తున్నట్లు బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. నిజానికి అర్జున్ కపూర్ తండ్రి బోణీకపూర్ తో సల్మాన్ కి మంచి రిలేషన్ ఉంది. బోణీ కపూర్ ఆర్ధిక కష్టాల్లో ఉన్నప్పుడు సల్మాన్ 'నో ఎంట్రీ' సినిమా చేసిపెట్టాడు. ఆ సినిమాతో బోణీ కపూర్ కాస్త సెటిల్ అయ్యాడు.

ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ చేయాలని భావించి బోనీకపూర్.. సల్మాన్ ఖాన్ హీరో అని ప్రకటించేసాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సల్మాన్ కావాలనే సినిమా నుండి తప్పుకున్నాడు. కనీసం ఆ విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. పరోక్షంగా ఎంత ఎఫెక్ట్ చేస్తున్నా.. అర్జున్-మలైకాలు మాత్రం బాగానే ఉండడంతో సల్మాన్ మరింత రగిలిపోతున్నాడు.

ఇప్పుడు బోణీకపూర్, అర్జున్ కపూర్ లను తను ఉన్న ఛాయలకు కూడా రావొద్దని వార్నింగ్ పాస్ చేశాడట. నిజానికి అర్జున్ కపూర్ వ్యవహరం బోణీకపూర్ కి కూడా నచ్చడం లేదట. కానీ అర్జున్ మాత్రం తండ్రి మాట లెక్కచేయడం లేదని తెలుస్తోంది.