Asianet News TeluguAsianet News Telugu

`టైగర్‌ 3` సెన్సార్‌ రిపోర్ట్.. నిడివి ఎక్కువా? తక్కువా?

నవంబర్‌ 12న గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా సెన్సార్‌ రిపోర్ట్ వచ్చింది. ఈ మూవీ ఎలా ఉంది? ఏం కట్స్ ఇచ్చారు అనేది చూస్తే, 

salman khan tiger3 censor report arj
Author
First Published Nov 10, 2023, 11:43 PM IST

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ నటించిన మూవీ `టైగర్‌ 3`. `టైగర్‌` సిరీస్‌లో వచ్చిన మూడో సినిమా. మనీష్‌ శర్మ దర్శకత్వం వహించారు. కత్రినా కైఫ్‌ హీరోయిన్‌గా చేసింది. ఇమ్రాన్‌ హష్మీ నెగటివ్‌ రోల్‌ చేశారు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందింది. దీపావళి పండుగ సందర్బంగా ఆదివారం విడుదల కాబోతుంది. 

నవంబర్‌ 12న గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా సెన్సార్‌ రిపోర్ట్ వచ్చింది. ఈ మూవీ ఎలా ఉంది? ఏం కట్స్ ఇచ్చారు అనేది చూస్తే, తాజాగా ఈ మూవీ సెన్సార్‌ పూర్తి చేసుకుని `యు ఏ` సర్టిఫికేట్‌ పొందింది.  అదే సమయంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఆకట్టుకునేలా ఉందని అంటున్నారు. ఈ మూవీ నిడివి కూడా హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఇది కేవలం రెండున్నర గంటలే ఉంది. రెండు గంటల 33 నిమిషాలు. 

ఇటీవల భారీ సినిమాలు, పెద్ద హీరోల చిత్రాల నిడివి మూడు గంటల వరకు ఉంటుంది. ఎక్కువ నిడివితోనే విడుదల చేస్తున్నారు. కానీ సల్మాన్‌ మూవీ మాత్రం రెండున్నర గంటలే ఉండటం ఆశ్చర్యపరుస్తుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా పెద్ద సినిమాలో పోల్చితే ఇది చాలా తక్కువే అని తెలుస్తుంది. ఇదే ఇప్పుడు ఆశ్చర్యపరుస్తుంది. తక్కువ నిడివితో ఈ మూవీ రాబోతుందని చెప్పొచ్చు. షార్ట్ అండ్‌ స్వీట్‌గా ఎంటర్‌టైన్‌ చేయబోతుంది. 

ఇక సల్మాన్‌ ఖాన్‌, కత్రినా జంటగా నటించిన `టైగర్‌ 3` పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే సల్లూ భాయ్‌ గత చిత్రాలు డిజప్పాయింట్‌ చేయడంతో ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్‌లో పెద్ద జోరు చూపించడం లేదట. అయితే అది రేపటితో తేలనుంది. ఆదివారం స్పెషల్‌గా అసలైన పండగని తీసుకురాబోతుంది కత్రినా. హిందీలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్‌ వెర్షన్‌ రూపొందుతుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios