ఆర్ఆర్ఆర్ చిత్రంలో బోను నుంచి పులలతోపాటు.. జంప్ చేసిన వ్యక్తితో కలిసి పనిచేయడానికి ఇష్టపడతాను.. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన అద్భుతం అలాగే అతను
ఇప్పుడు ప్రపంచ సినిమాకు ముఖ్యంగా హాలీవుడ్ కు ఇండియన్ మార్కెట్ అవసరమైంది. అందుకోసం ప్రమోషన్స్ లో భాగంగా ఇక్కడ స్టార్స్ పై డైరెక్టర్ జేమ్స్ గన్ రూపొందించిన గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3 చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని మే5 విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల డైరెక్టర్ జేమ్స్ గన్ మాట్లాడుతూ… ట్రిపుల్ ఆర్ సినిమాతోపాటు.. ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న జేమ్స్ గన్ ను ఉద్దేశిస్తూ.. గార్డియన్స్ ప్రపంచంలోకి ఒక భారతీయ నటుడిని పరిచయం చేయాలనుకుంటే ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తారని ప్రశ్నించగా.. జేమ్స్ మాట్లాడుతూ.. “ఆర్ఆర్ఆర్ చిత్రంలో బోను నుంచి పులలతోపాటు.. జంప్ చేసిన వ్యక్తితో కలిసి పనిచేయడానికి ఇష్టపడతాను.. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన అద్భుతం అలాగే అతను ఎంతో ప్రశాంతంగా కనిపించాడు” అని పేర్కొన్నాడు. ఇప్పుడు ఏకంగా సల్మాన్ ఖాన్ తో ఓ ట్రైలర్ ని వదిలారు. వివరాల్లోకి వెళితే...
మార్వెల్(Marvel) యూనివర్స్ కి చెందిన గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమా మొదటి వాల్యూమ్ 2014 లో రిలీజ్ అయ్యి మంచి విజయన్నే అందుకుంది. ఇక రెండవ పార్ట్ 2017లో రిలీజయ్యింది. ఇక ఇప్పుడు గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 రిలీజ్ కాబోతుంది. మే 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇండియాలో కూడా ఈ సినిమాని భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
అయితే ఇండియాలో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ని వాడేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ కోసం సల్మాన్ తో ఏకంగా ఓ యాడ్ కూడా షూట్ చేశారు. రీసెంట్ గా ఆ యాడ్ ని రిలీజ్ చేశారు. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమాలోని గ్రూట్ క్యారెక్టర్ లాగా సల్మాన్ కామెడీ చేస్తున్నట్టు ఈ యాడ్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమా కోసం సల్మాన్ చేసిన ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజాగా సల్మాన్ యాడ్ తో ఈ సినిమాపై ఇండియాలో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మార్వెల్ స్టూడియోస్ “గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3” మే 5న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషలలో రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమా ఇండియాలో ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.
