అభిమానులందు వీరాభిమానులు వేరయా...అన్నట్లుగా అభిమానులు ఏదో తమ హీరో చిత్రం రిలీజ్ రోజు సైలెంట్ గా వెళ్లి మార్నింగ్ షో చూసి వచ్చి ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టి సంబరపడిపోతారు. కానీ వీరాభిమానుల లెక్కలు వేరుగా ఉంటాయి. వారు సినిమా చూడకపోయినా ఫర్వాలేదు కానీ తమ హీరో సినిమాకు ఎంత పెద్ద ప్లెక్సీ పెట్టారు. సిటీలో ఎన్ని కటౌట్స్ తమ సినిమాకు పెట్టారు. సినిమా జరుగుతున్నప్పుడు ఏ రేంజిలో రచ్చ చేసాం అనేది చూసుకుంటారు. ఇలాంటి ఓ వీరాభిమాని మరో అడుగు ముందుకు వేసి.. రిలీజ్ రోజు మార్నింగ్ షోకు థియోటర్ మొత్తం బుక్ చేసేసాడు. నాసిక్ లోని ఓ ధియోటర్ లో ఈ సంఘటన జరిగింది. 

ఆశిష్ సింఘాల్ అనే పేరు గల ఈ అభిమాని తన భాయ్ సినిమా రిలీజ్ ని ఇలా టిక్కెట్ల్ అన్ని బుక్ చేయటం ద్వారా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నారట. అసలు ఆ రోజు అన్ని షోలు టిక్కెట్లు బుక్ చేసేద్దామనుకున్నా అతని ఆర్దిక స్దోమత సహకరించక ఆగిపోయాడట. 

 ఇక ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ చిత్రాల్లో భారత్‌ ఒకటి. అలీ అబ్బాస్‌ దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌, టబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పట్ల ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.  ‘నా జుట్టు, గడ్డం నెరిసిపోవచ్చు.. కానీ నా జీవితం మాత్రం చాలా రంగులమయం’ అంటూ సల్మాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ అభిమానులను ఒకింత షాక్‌కు గురిచేసింది 

సినిమాలో సల్మాన్‌ 20 ఏళ్ల యువకుడి నుంచి 70 ఏళ్ల వృద్ధుడి వరకు వివిధ రకాల లుక్స్‌లో కనిపిస్తారంటూ చిత్ర యూనిట్  మొదటి నుంచి చెబుతూనే ఉంది.  ఓ మనిషి, దేశం కలిసి చేసిన ప్రయాణం అంటూ పోస్టర్‌ మీద ఉన్న వ్యాఖ్యలు సినిమా పట్ల మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.  సినిమాలో జాకీష్రాఫ్‌ కూడా ఉన్నారు. ఈ చిత్రంలో ఆయన సల్మాన్‌ తండ్రిగా కనింపిచనున్నారని సమాచారం. 2014లో వచ్చిన కొరియన్‌ హిట్‌ మూవీ ‘యాన్‌ ఓడ్‌ టు మై ఫాదర్‌’కి ‘భారత్‌’ హిందీ రీమేక్‌. ఈ ఏడాది ఈద్‌ స్పెషల్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.